అంతకుమించిన సంతృప్తి ఏదీ లేదంటున్న మెగాస్టార్

అద్భుత నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించించుకున్న మెగాస్టార్ చిరంజీవి సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు. తన  బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిమానులను పాల్గొనాలని చెబుతుంటారాయన. రాజకీయాల్లో అంత సక్సెస్ కాలేకపోయినా.. జనాలకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు చిరు.  కరోనా వైరస్ సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసిన వేళ.. కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి  సినీ కార్మికులకు నెలవారీ సరుకులు […]

Written By: admin, Updated On : June 14, 2020 2:47 pm
Follow us on


అద్భుత నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించించుకున్న మెగాస్టార్ చిరంజీవి సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు. తన  బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిమానులను పాల్గొనాలని చెబుతుంటారాయన. రాజకీయాల్లో అంత సక్సెస్ కాలేకపోయినా.. జనాలకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు చిరు.  కరోనా వైరస్ సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసిన వేళ.. కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి  సినీ కార్మికులకు నెలవారీ సరుకులు డోర్ డెలివరీ చేయిస్తున్నాడు.

ఇలా ఎన్ని రకాల సేవలు చేసినా..  ఒకరి ప్రాణాన్ని కాపాడడానికి మించిన సంతృప్తి మరేదీ లేదని ఆయన అంటున్నారు.రక్తదానం అది గొప్పదని ఆయన చెప్పారు. వరల్డ్ బ్లడ్‌ డోనర్ డేను పురస్కరించుకొని ఆదివారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ ఏర్పాటు చేసినప్పటి నుంచి తాను రక్తదానం చేసిన ఫొటోలతో రూపొందించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘ఒకరి జీవితాన్ని కాపాడడం కంటే మించిన సంతృప్తి మరేం ఉంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు.. ప్రజలు రక్తదానం చేస్తున్నారు అని నేను విన్న ప్రతీసారి  మానవాళికి అంతగొప్ప శక్తిని ఇచ్చిన ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెబుతుంటా. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి’ అని చిరు ట్వీట్ చేశారు.

చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో  రక్తదాన శిబిరాలు నిర్వర్తిస్తుంటారు. అలాగే, చిరు పిలునిచ్చినప్పుడల్లా  వేలు, లక్షల సంఖ్యలో ముందుకొస్తుంటారు. లాక్‌డౌన్‌లోనూ చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు రక్త దానం చేశారు. కాగా, చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో  చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్‌చరణ్నిర్మాత కాగా.. మణిశర్మ  మ్యూజిక్ డైరెక్టర్. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ చేసేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది.
https://twitter.com/KChiruTweets/status/1272023629698494465