https://oktelugu.com/

షాకింగ్ : కరోనాతో రాలిన మరో దర్శక, రచయిత !

తెలుగు సినీ పరిశ్రమలో కరోనా కారణంగా మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారితో ప్రముఖ రచయిత, ద‌ర్శ‌కుడు నంద్యాల రవి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన ఉదయం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నంద్యాల రవికి సినీ ప్రముఖులు అండగా నిలబడి ఆర్ధిక సాయం […]

Written By:
  • admin
  • , Updated On : May 14, 2021 / 12:42 PM IST
    Follow us on

    తెలుగు సినీ పరిశ్రమలో కరోనా కారణంగా మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారితో ప్రముఖ రచయిత, ద‌ర్శ‌కుడు నంద్యాల రవి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన ఉదయం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

    నంద్యాల రవికి సినీ ప్రముఖులు అండగా నిలబడి ఆర్ధిక సాయం కూడా చేశారు. అయినా ఆయన ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. రచయితగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నంద్యాల రవి సినీ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన సినీ ప్రస్థానం కూడా ఎంతో విభిన్నంగా సాగింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి రచయితగా,

    అలాగే రచయిత నుండి దర్శకుడిగా, మళ్ళీ దర్శకుడి నుండి రచయితగా ఆ తరువాత కూడా కో డైరెక్టర్ గా ఇలా పలు రకాలుగా ఆయన సినీ ప్రస్థానం సాగుతూ వచ్చింది. ఇక రవి సినిమా దర్శకుడిగానూ హీరో నాగశౌర్యతో ఓ సినిమా తీశారు. అలాగే పలు చిత్రాలకు ఆయన ఘోస్ట్ రైటర్ గా కూడా పని చేశారు. నంద్యాల రవి మృతి పై చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసింది.

    ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నంద్యాల రవి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.