Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలను తీసి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న సినిమా థియేటర్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారయింది… నిజానికి కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ల చెప్పు చేతుల్లో థియేటర్లను పెట్టుకొని సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళ సినిమాలకే ఎక్కువ థియేటర్లను కేటాయించుకోవడం వల్ల మిగతా సినిమాలకు థియేటర్లు దొరక్కుండా పోతున్నాయి. దీనివల్ల మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు సైతం ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోతున్నాయి. మన దగ్గర ఉన్న ప్రొడ్యూసర్లు గుత్తాధిపత్యం వల్ల వాళ్లు ఇతర భాషల సినిమాలను రిలీజ్ చేసినప్పటికి ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించి వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. నిజానికైతే పండుగ సమయంలో తెలుగు సినిమాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. డబ్బింగ్ చిత్రాలకు అరకొర థియేటర్లు ఇవ్వాలి. ఎక్కువ థియేటర్లను స్ట్రెయిట్ సినిమాలకు కేటాయించాలి. కానీ మనదగ్గర రివర్స్ లో జరుగుతుంది.
డబ్బింగ్ సినిమాలనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి ఆడిస్తున్నారు. తమిళనాడు లాంటి స్టేట్లో పండుగ సీజన్లో మన సినిమాలు రిలీజ్ అయితే ఒకటి రెండు థియేటర్లు మాత్రమే ఇస్తారు ఎక్కువ సంఖ్యలో వాళ్ళ సినిమాలకే థియేటర్లను కేటాయించుకుంటారు. కానీ మన దగ్గర మాత్రం అలాంటి నియమాలు అమల్లో లేకుండా పోతున్నాయి.
Also Read : ఈ స్టార్ హీరోలు బావ బామ్మర్దులనే విషయం మీకు తెలుసా..?
దీనివల్లనే తెలుగు ఇండస్ట్రీ చాలా వరకు వెనుకబడిపోతుంది. ఇతర భాషల్లో సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడానికి మనవాళ్ళు తెగ ఆరాటపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలకు థియేటర్ యాజమన్యానికి విపరీతమైన నష్టమైతే వాటిల్లుతుంది. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. అందరూ ఓటిటి ని ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.
అందువల్ల థియేటర్ల యజమానులకు నష్టం జరగడమే కాకుండా ఇండస్ట్రీ కూడా భారీగా నష్టపోతుంది… మరి దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒకే తాటి పైన నిల్చొని ఈ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.