https://oktelugu.com/

డజనుకు పైగా కథలు విన్న రామ్.. చివరికి హ్యాండిచ్చాడా?

యంగ్ హీరో రామ్ పోతినేనికి టాలీవుడ్లో ఎనర్జీటిక్ స్టార్ గా పేరుంది. ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ తొలి మూవీ సూపర్ హిట్టు అందుకున్నాడు. తొలిచిత్రంతోనే రామ్ ఫిలీంఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు హిట్ చిత్రాల్లో నటించిన రామ్ స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు. Also Read: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి రోజుల్లో సినిమావాళ్లను ఎందుకు దూరం పెట్టాడు? ఇటీవలే రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 04:55 PM IST
    Follow us on

    యంగ్ హీరో రామ్ పోతినేనికి టాలీవుడ్లో ఎనర్జీటిక్ స్టార్ గా పేరుంది. ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ తొలి మూవీ సూపర్ హిట్టు అందుకున్నాడు. తొలిచిత్రంతోనే రామ్ ఫిలీంఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు హిట్ చిత్రాల్లో నటించిన రామ్ స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు.

    Also Read: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి రోజుల్లో సినిమావాళ్లను ఎందుకు దూరం పెట్టాడు?

    ఇటీవలే రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ ను యూత్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ మూవీ హిట్టుతో రామ్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రామ్ మాత్రం తన తాజా సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.

    స్టార్ హీరోగా రాణించేందుకు రామ్ కు టాలీవుడ్లో చాలా అవకాశాలు వచ్చినా అతడు సరిగ్గా వినియోగించుకోలేక పోయాడు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు మళ్లీ స్టార్డమ్ వచ్చింది. దీనిని నిలబెట్టుకునేందుకు రామ్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తాజా సర్ ప్రైజ్ కి రీజన్ అదే !

    ‘రెడ్’ తర్వాత రామ్ చేయబోయే మూవీపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే రామ్ తన స్టార్డమ్ కొనసాగించే కథ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రామ్ ఇప్పటివరకు 12కు పైగా కథలు విన్నట్లు తెలుస్తోంది. ఈ కథలేవీ కూడా రామ్ ను మెప్పించలేకపోయినట్లు సమాచారం.

    ఏమాత్రం కథపై నమ్మకం లేకపోయినా రామ్ రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ తన రకరకాల గెటప్స్ లో కన్పిస్తూ కొత్త తరహా కథలతో తన వద్దకు దర్శకులు రావాలంటూ హింట్ ఇస్తున్నాడు. రామ్ మెచ్చే కథ ఎప్పటికి దొరకుతుందో.. ఎప్పుడో పట్టాలెక్కుతుందోననే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్