https://oktelugu.com/

టాలీవుడ్ అప్డేట్: మేనేజర్లు కాస్తా నిర్మాతలుగా మారుతున్నారా?

  టాలీవుడ్లో హీరోహీరోయిన్లకు మేనేజర్లు పని చేస్తున్న వారంతా సినిమా నిర్మాణంపై దృష్టిసారిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా మేనేజర్లు తమ పలుకుబడి ఉన్నప్పుడే టాలీవుడ్లో సెటిల్ కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు మేనేజర్ల నుంచి కొత్తగా నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. Also Read: మాస్టర్ టీజర్ రిలీజ్: విజయ్ వర్సెస్ విజయ్..! తాజాగా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ మేనేజర్లు నిర్మాతలు మారడం ఆసక్తిని రేపుతోంది. మహేంద్ర.. కిరణ్ లకు టాలీవుడ్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 11:41 AM IST
    Follow us on

     


    టాలీవుడ్లో హీరోహీరోయిన్లకు మేనేజర్లు పని చేస్తున్న వారంతా సినిమా నిర్మాణంపై దృష్టిసారిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా మేనేజర్లు తమ పలుకుబడి ఉన్నప్పుడే టాలీవుడ్లో సెటిల్ కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు మేనేజర్ల నుంచి కొత్తగా నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు.

    Also Read: మాస్టర్ టీజర్ రిలీజ్: విజయ్ వర్సెస్ విజయ్..!

    తాజాగా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ మేనేజర్లు నిర్మాతలు మారడం ఆసక్తిని రేపుతోంది. మహేంద్ర.. కిరణ్ లకు టాలీవుడ్లో సీనియర్ మేనేజర్లు అనే మంచి పేరుంది. మహేంద్ర టాలీవుడ్లోని టాప్ హీరోయిన్ల వ్యవహరాలను చక్కబెడుతుండగా.. కిరణ్ సైతం రష్మిక.. కీర్తిశెట్టి.. ఇంద్రగంటి.. వెంకీ కుడుముల తదితరులకు మేనేజర్ గా పని చేస్తున్నాడు.

    ఇదిలా ఉంటే మహేంద్ర.. కిరణ్ లు కలిసి హీరో సుధీర్ బాబుతో కలిసి ఓ మూవీని ప్లాన్ చేశారు. వీరికి పరిచయం ఉన్నవారితోనే సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతుండటం విశేషం. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు.. కీర్తిశెట్టి హీరోహీరోయిన్లుగా మూవీని అధికారికంగా ప్రకటించడం గమనార్హం.బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్లో రోమాంటిక్.. కామెడీ ఎంటటైన్మెంట్మ్ తో సినిమా రాబోతుంది.

    Also Read: దీపావళి టపాసులతో బండ్ల గణేష్.. నెటిజన్ల కౌంటర్..!

    ‘వి’ తర్వాత ఇంద్రగంటితో కలిసి సుధీర్ బాబు మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. ఈ మూవీని తొలుత నాగచైతన్య అనుకున్నప్పటికీ ప్రస్తుతం అతడు బీజీగా ఉండటంతో సుధీర్ బాబుతో సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్లోని మేనేజర్లంతా నిర్మాతలుగా మారితే మేనేజర్ల కొరత వస్తుందనే సైటర్స్ మాత్రం విన్పిస్తున్నాయి. హీరోహీరోయిన్ల వ్యవహారాలను చక్కబెట్టే మేనేజర్లు నిర్మాతలుగా రాణిస్తారో లేదో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్