Tollywood: కరోనా నుంచి బ్రేక్ రావడంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు రెడీ అవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం అన్ని చిన్న సినిమాలే రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అవి రావణాలంక, ఊరికి ఉత్తరాన, రామ్ అసుర్, స్ట్రీట్ లైట్… పోస్టర్, సావిత్రి w/o సత్యమూర్తి, మిస్టర్ లోన్లీ సినిమాలు. బాలీవుడ్ నుంచి మాత్రం నవంబరు 19న సైఫ్ అలీఖాన్ నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.
ఇక థియేటర్ లో అంత ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏమి లేకపోవడంతో ఓటిటి వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ సారి మాత్రం ఓటిటిలో కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు. జీ5లో ఈ నెల 19న ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్ విడుదల కానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల స్వయంగా ఈ సిరీస్ ని నిర్మించింది. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా చేస్తున్నాడు.
అలానే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని మొదటి సారి హీరోయిన్ గా, తేజ సజ్జా హీరోగా రాబోతున్న సినిమా ‘అద్భుతం’. ఈ సినిమా కూడా నవంబర్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా… మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇక అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా నవంబరు 19న ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలలో స్ట్రీమింగ్ అవ్వనుంది. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ లో హాలీవుడ్ సినిమా నెవర్ బ్యాక్ డౌన్ నవంబరు 16న విడుదల అవ్వబోతుంది. ద వీల్ ఆఫ్ టైమ్ వెబ్ సిరీస్ నవంబరు 19న రిలీజ్ అవ్వనుంది.