Tollywood Top Hero: నిత్యం ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన ఫోటోలు కానీ, వార్తలు కానీ సామాజిక మాధ్యమాలలో వినిపిస్తూనే ఉంటాయి. అలాగే అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరో హీరోయిన్ల లకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో స్టార్ హీరో పాత ఫోటో ఒకటి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఇతను కూడా ఒకరు. హిట్ ప్లాపులు తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ హీరో. ఈ టాలీవుడ్ హీరో ఒకప్పుడు బ్యాట్మెంటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక తరఫున కూడా అతను ఒకప్పుడు బ్యాట్మెంటన్ లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి ఒకప్పుడు ఇతను డబుల్సు కూడా ఆడడం జరిగింది. నటనపై తనకున్న ఇష్టంతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం హీరోయిజం ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా విభిన్న కథలు ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.
Also Read: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఖుష్బు కూతురు.. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే..
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోకు ఈయన స్వయాన బావ అవుతారు. అలాగే ఈ హీరో త్వరలోనే తన కొడుకుని కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఈ హీరో మరెవరో కాదు సుధీర్ బాబు. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ బాబు దివంగత నటుడు కృష్ణకు అల్లుడు. ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్వయాన బావ అవుతారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్నారు. ఒకప్పుడు సుధీర్ బాబు బ్యాట్మెంటన్ ప్లేయర్. కానీ నటనపై తనకున్న ఇష్టంతో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సుధీర్ బాబు హీరోయిన్ సమంతకు అన్నగా ఏం మాయ చేసావే సినిమాలో నటించారు.
ఆ తర్వాత తెలుగులో ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే నటనపరంగా మంచి మార్కులు కొట్టేశారు. తెలుగులో సుధీర్ బాబు సమ్మోహనం, ప్రేమ కథా చిత్రం వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ కూడా సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విభిన్న కథ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినిమాలు చేయడం సుధీర్ బాబు స్పెషాలిటీ. సుధీర్ బాబు, ప్రియదర్శిని దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీళ్ళిద్దరిలో పెద్ద కుమారుడు త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ బాబు పెద్దకొడుకు యాక్టింగ్ రంగంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది.