https://oktelugu.com/

Tollywood Best Multi Starrers: టాలీవుడ్ లో వచ్చిన టాప్ 10 మల్టీస్టారర్ సినిమాలు ఇవే..

Tollywood Best Multi Starrers: టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు ఒకప్పుడు ఎక్కువగా వచ్చేవి. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తరంలో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొన్ని క్లాసిక్ మూవీలుగా పేరు తెచ్చుకున్నాయి. అయితే స్టార్ హీరోలు మల్టీస్టారర్ చేసి గొప్పగా నటించారు అని పేరు తెచ్చుకోవడంతో పాటు కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వారి వారి ఫ్యాన్స్ అప్పట్లో నానా రచ్చ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 29, 2022 / 10:41 AM IST
    Follow us on

    Tollywood Best Multi Starrers: టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు ఒకప్పుడు ఎక్కువగా వచ్చేవి. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తరంలో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొన్ని క్లాసిక్ మూవీలుగా పేరు తెచ్చుకున్నాయి. అయితే స్టార్ హీరోలు మల్టీస్టారర్ చేసి గొప్పగా నటించారు అని పేరు తెచ్చుకోవడంతో పాటు కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వారి వారి ఫ్యాన్స్ అప్పట్లో నానా రచ్చ చేసేవారు. దీంతో తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి వారు మల్టీస్టారర్ జోలికి వెళ్లలేదు.

    కానీ వెంకటేష్ మాత్రం చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. అయితే గత పదేళ్లలో వచ్చిన టాప్ టెన్ మల్టీస్టారర్ మూవీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. రామ్ పోతినేని, వెంకటేష్ హీరోలుగా వచ్చిన మూవీ మసాలా. రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయింది.

    Seethamma Vakitlo Sirimalle Chettu

    నాగార్జున, నాగచైతన్య, అక్కినేని నాగేశ్వరావు కలిసి నటించిన మూవీ మనం. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నాగార్జున, కార్తీ హీరోలుగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఊపిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గోపాల గోపాల. బాలీవుడ్ మూవీ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    Also Read: RRR Latest Collections : అన్నీ చోట్ల అదే విజృంభణ.. !

    Manam

    నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామచంద్ర డైరెక్షన్ లో వచ్చిన సినిమా దేవదాస్. ఈ సినిమా ఆవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన మూవీ వెంకీ మామ. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    f2-movie

    నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మూవీ బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన రీమేక్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఎన్నో అంచనాల మధ్య, ఎదురుచూస్తుండగా వచ్చిన సినిమా త్రిబుల్ ఆర్. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

    rrr

    Also Read:RGV Tweets On Rajamouli: రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం !

    Recommended Video:

    Tags