Tollywood: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సినీ పరిశ్రమ బాగుండాలనేదే తన ఆకాంక్ష అని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. జగన్ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటారని వ్యాఖ్యానించారు. అందరి మేలు కోసం పనిచేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. సినీ ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికుల జీవితాలు బాగుపడాలని పోసాని ఆకాంక్షించారు. మరి నిజంగానే జగన్ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటే.. సినీ కార్మికులు ఎందుకు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందో.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పవన్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమైంది. రాబోవు పెద్ద చిత్రాల్లో భీమ్లానే మొదట విడుదలయ్యే సూచనలున్నాయి. ఇవాళ ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, భీమ్లా ఫిబ్రవరి 25 లేదా, మార్చ్ 25న రావచ్చని భావిస్తున్నారు. ఈక్రమంలో ఈ చిత్ర బిజినెస్ అనూహ్య రీతిలో సాగినట్టు సమాచారం. ఒక్క థియేట్రికల్ హక్కులే రూ. 100 కోట్లు దాటేశాయట.
Also Read: Varunreddy: హాట్ టాపిక్ గా వరుణారెడ్డి పేరు.. వివేకా హత్య కేసు నిందితుల గుండెల్లో గుబులు..?

ఇక మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. విక్రమ్ మహాన్ రిలీజ్ అయింది. విక్రమ్ కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కూడా మొదటి చిత్రం (అర్జున్ రెడ్డి రీమేక్)తో తమిళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ తండ్రీకొడుకులిద్దరూ కలిసి తాజాగా నటించిన చిత్రం మహాన్. రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శితం కానుంది. అయితే కొన్ని గంటలకు ముందే, అంటే ఇవాళ రాత్రి 10:30-11 మధ్యే అమెజాన్‌లో మహాన్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ అప్ డేట్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు కొన్ని గంటలపాటే బుల్లితెరపై వినోదాన్ని పంచిన బిగ్‌బాస్, ఇక 24 గంటలు అందుబాటులోకి రానుంది. అది కూడా సెన్సార్ కటింగులు లేకుండా పూర్తిస్థాయిలో ప్రదర్శితం కానుంది. ఎందుకంటే ఓటీటీలో ఇప్పటివరకు సెన్సార్ చేసే మెకానిజమ్ అయితే లేదు. ఈ ఏడాదిలోనే డిస్నీ+హాట్‌స్టార్‌పై నాన్‌స్టాప్‌గా బిగ్‌బాస్ ప్రసారం కానున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఈక్రమంలో లోగోను కూడా విడుదల చేశారు. మరి ఈ షో ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: టీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన?