Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: జగన్ తో ఈ రోజు పరిష్కారం దొరికింది - చిరంజీవి

Chiranjeevi: జగన్ తో ఈ రోజు పరిష్కారం దొరికింది – చిరంజీవి

Chiranjeevi:  ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌ గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు మాట్లాడారు. సీఎం జగన్‌.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హీరోలకు అభయం ఇచ్చాడు. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చిరు అండ్ టీం ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

AP Movie Ticket Price Issue
Chiranjeevi With Jagan

సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరు చెప్పారు. అలాగే చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమపై కొద్దికాలంగా నెలకొన్న సమస్యలకు ఈరోజు సీఎం జగన్‌తో సమావేశంతో పరిష్కారం దొరికిందని చిరంజీవి తెలిపారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, చిన్న సినిమాలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ వచ్చిందన్నారు.

Also Read:  హైదరాబాద్ లో వీధికుక్కను వదలని కామాంధుడు.. శృంగారం చేస్తూ కెమెరా చేతికి చిక్కాడు

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం హమీ ఇచ్చారని తెలిపారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని చిరు కొనియాడారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరంజీవి తెలిపారు. అలాగే చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. అటు సినిమా పరిశ్రమపై సీఎం దగ్గర అద్భుత ఆలోచనా విధానం ఉందని రాజమౌళి అన్నారు.

కాగా తెలుగుచిత్ర సమస్యలపై సినీ ప్రముఖులు పలు ప్రతిపాదనలను ఏపీ సర్కారు ఎదుట ఉంచినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన పలు చిత్రాలకు సబ్సిడీ, జీఎస్టీ మినహాయింపు, ప్రభుత్వ చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అద్దె మినహాయింపు, ఆన్‌లైన్‌ టికెట్‌ అమలు ఫిల్మ్‌ ఛాంబర్‌కు అప్పగించడం, ఐదో షోకి అనుమతి, టాలీవుడ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడం, ఏటా నంది అవార్డులు అందజేయడం, వంటి ప్రతిపాదనలపై సీఎం జగన్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Also Read:హాట్ టాపిక్ గా వ‌రుణారెడ్డి పేరు.. వివేకా హ‌త్య కేసు నిందితుల గుండెల్లో గుబులు..?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular