Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్షోభం లో పడింది. ఇలా మన ఇండస్ట్రీ సంక్షోభం లో పడడం కొత్తేమి కాదు. ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేసే మన స్టార్ హీరోలు, ఇప్పుడు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. సమ్మర్ వచినదంటే చాలు నెలకు ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో ఉండేవి. కానీ ఈ సమ్మర్ లో మాత్రం ఒక్క స్టార్ హీరో సినిమా కూడా విడుదల లేకపోవడం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు, ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్’ చిత్రాలు మార్చి, ఏప్రిల్ నెలలో విడుదల కావాలి. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం కూడా రావాల్సి ఉంది. కానీ ఈ మూడు సినిమాలకు VFX రెడీ కాకపోవడంతో వాయిదా పడాల్సి వచ్చింది. మే 9 న విడుదల కావాల్సిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఇప్పుడు మే30 కి వాయిదా పడే అవకాశం ఉంది.
Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ షూటింగ్ ఫోటో లీక్..రేపటి నుండి ఫ్యాన్స్ కి పండగే!
కనీసం మే30 కి అయినా వస్తుందా అంటే అనుమానమే. ఇక రాజా సాబ్ చిత్రం ఎప్పుడు వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. ‘విశ్వంభర’ పరిస్థితి కూడా అంతే. దీంతో థియేటర్స్ లో జనాలు లేక వెలవెలబోతున్నాయి. కనీసం కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉండడం తో అనేక ప్రాంతాల్లో థియేటర్స్ మూత పడే పరిస్థితి ఏర్పడింది. కాసేపటి క్రితమే తూర్పు గోదావరి జిల్లాల డిస్ట్రిబ్యూటర్స్, ఇక నుండి విడుదల అవ్వబోయే సినిమాలు కమీషన్ బేసిస్ మీద రిలీజ్ చేయాలనీ, లేకపోతే జూన్ 1వ తేదీ నుండి థియేటర్స్ మూసి వేస్తామంటూ నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కరోనా కి ముందు ఇలాంటి సమస్యలు అసలు ఉండేవి కాదు. ఎందుకంటే అంతకు ముందు మన స్టార్ హీరోలందరూ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసేవారు.
కమర్షియల్ సినిమాలు అంటే కేవలం ఆరు నెలల్లో సినిమా రెడీ అయిపోతుంది. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ అభిరుచులు పూర్తి గా మారిపోయాయి. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మన స్టార్ హీరోలు కూడా అప్డేట్ అయ్యి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను తీసేందుకే మొగ్గు చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాల వైపుకు వెళ్లడం లేదు. అందుకే ఏడాదికి కనీసం ఒక్కటి అయినా విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు, ఇప్పుడు మూడేళ్లు దాటినా విడుదలకు నోచుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి నుండి మన టాలీవుడ్ ఎప్పుడు బయట పడుతుందో. ప్రభాస్ కూడా తన తోటి హీరోలు లాగానే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. కానీ వాళ్ళ లాగ ఏళ్ళ తరబడి సమయం తీసుకోవడం లేదే?, ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, మిగతా హీరోలు ఎందుకు అలా చేయడం లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో అసంతృప్తి చెలరేగుతుంది.
Also Read: యాంకర్ రష్మీ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్..కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!