Rashmi and Prabhas : తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు రష్మీ గౌతమ్(Rashmi Gautam). ‘జబర్దస్త్'(Jabardasth) కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన హుషారైన యాంకరింగ్ తో రష్మీ దాదాపుగా పదేళ్ల నుండి బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈమెకు యూత్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అలా మంచి క్రేజ్ రావడంతో పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. వాటిల్లో ‘గుంటూరు టాకీస్’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది కానీ, ఆ తర్వాత విడుదలైన చిత్రాలు ఎప్పుడు విడుదల అయ్యాయో, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయాయో కూడా తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఈ నెల 27 న రష్మీ పుట్టిన రోజు. ఆమె పుట్టిన రోజుకు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఇచ్చిన ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాలో హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్నది ఎవరో తెలుసా?
ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ రష్మీ కి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి?, అదెలా సాధ్యం అని అనుకుంటూ ఉన్నారు కదా. అక్కడికే వస్తున్నాం, వచ్చే ఆదివారం ప్రసారం అవ్వబోయే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ ప్రోమో లో టీం మొత్తం కలిసి రష్మీ పుట్టినరోజు వేడుకలను జరిపించారు. బులెట్ భాస్కర్ ప్రభాస్ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశాడు అంటూ ఒక వీడియో ని చూపిస్తాడు బుల్లెట్ భాస్కర్. అంత పెద్ద సూపర్ స్టార్ తనకు శుభాకాంక్షలు తెలియజేశాడా అని రష్మీ ఎంతో సంతోషిస్తుంది. దాదాపుగా ఆమె కళ్ళలో నుండి నీళ్లు వచ్చేసాయి. కానీ నిజంగా ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. గతంలో ఆయన ఒక స్పెషల్ అభిమానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశారు.
దానిని రష్మీ కి చెప్పినట్టుగా మార్చి చూపించారు. అనంతరం హైపర్ ఆది, ఇంద్రజ, బుల్లెట్ భాస్కర్ మరియు ఇతర బుల్లితెర నటులందరూ స్టేజి మీదకు రాగా, రష్మీ కేక్ కట్ చేసింది. రీసెంట్ గానే రష్మీ ఒక ముఖ్యమైన సర్జరీ చేయించుకుంది. తన శరీరం లో హెమోగ్లోబిన్ శాతం 9 కి పడిపోవడంతో ఆమె బాగా నీరసించిపోయింది. అదే విధంగా చాలా కాలం నుండి ఆమె భుజం నొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఉంది. ఈమధ్య కాలంలో నొప్పి తీవ్రత ఇంకా పెరగడం తో ఈ నెల 18న హాస్పిటల్ లో చేరిందట. విజయవంతంగా వైద్యులు సర్జరీ చేయడంతో ఇప్పుడు బాగానే ఉందట. కానీ మూడు వారాల పాటు ఆమెని విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు ఆదేశాలు ఇవ్వడం తో ఆమె షూటింగ్స్ కి దూరంగా ఉండనుంది. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అయినా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి కానీ, ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లో మాత్రం రష్మీ కనిపించదు.
Also Read : హీరోయిన్ రష్మిక అబార్షన్ చేయించుకుందా..? సంచలన నిజాలను బయటపెట్టిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్!