
Star Hero Surgeries: ‘ఇది సర్జరీల సీజన్’ అనే డైలాగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అదేంటో గానీ, ఈ మధ్య హీరోలందరూ వరుసగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో సర్జరీ చేయించుకున్న వాళ్ళ లిస్ట్ చూస్తే.. చిరంజీవి, రజనీకాంత్, సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా హీరోలందరూ సర్జరీలు చేయించుకున్నారు. ఎందుకు ఈ సర్జరీలు అనేది బయటకు తెలియదు.
ఇదేదో థెరపీ అని టాక్ నడుస్తోంది. లేదు, ఇది సర్జరీనే అని, గాయం నుంచి కోలుకోవడానికి హీరోలు ఈ సర్జరీలు చేయించుకున్నారని బాగా వినిపిస్తోంది. ఇంతకీ నిజమేమిటి.. ఏ హీరో ఎందుకు సర్జరీ చేయించుకున్నాడు అంటే.. ముందుగా బాలకృష్ణ విషయానికి వద్దాం.. బాలయ్యకు ఎప్పటి నుంచో కుడి భుజం నొప్పి ఉంది. ఆ నొప్పి ఈ మధ్య తీవ్రం కావడంతో బాలయ్య సర్జరీ చేయించుకున్నారు.
దాదాపు నాలుగు గంటలపాటు బాలయ్య సర్జరీ సాగింది. సర్జరీ అనంతరం బాలయ్యకు తన భుజం నొప్పి సమస్య తీరిందట. అలాగే మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఆయనకు కూడా కుడి చేతి సమస్య ఉంది. కుడిచేత్తో ఎక్కువ సేపు ఏ పని చేసినా తిమ్మిరిలు వస్తున్నాయట. పైగా ఒక్కోసారి ఏ పని చేయనివ్వదు అట.
అందుకే, అపోలో హాస్పటల్ లో కాస్మొటిక్ సర్జన్ ఆద్వర్యంలో చిరు చేతికి సర్జరీ చేశారు. అన్నట్టు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సర్జరీకి కారణం.. ఆయన రోడ్డు ప్రమాదం. యాక్సిడెంట్లో సాయి తేజ్ కాలర్ బోన్ బాగా విరిగింది. దాంతో తేజ్ కి దాదాపు 24 గంటల పాటు వైద్యులు సర్జరీ చేయాల్సి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా కుడి భుజం సర్జరీ జరిగింది.
అలాగే మొన్న జూనియర్ ఎన్టీఆర్ చేతి వేళ్లకు ఫాక్చర్ కనిపించింది. ఎన్టీఆర్ తన ఇంట్లో జిమ్ చేస్తుండగా వేళ్లకు ఫ్యాక్చర్ అయింది. దాంతో ఎన్టీఆర్ కి కూడా చిన్నపాటి సర్జరీ జరిగిందట. ఒక్క తెలుగు హీరోలకే కాదు, అటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. రజినీకి కరోటిడ్ ధమనిలో బ్లాక్ సమస్య వచ్చింది. దాంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యులు రజనీకి సర్జరీ చేశారు.
Also Read: ఎన్టీఆర్ కుడి చేతికి సర్జరీ.. కోలుకోవాలని అభిమానుల ప్రార్ధనలు!
షూటింగ్ కు రావడం లేదని చిరంజీవి నన్ను కిందపడేసి కాలితో తొక్కేశారు