Homeఎంటర్టైన్మెంట్Tollywood Stars Food Habits: టాలీవుడ్ స్టార్స్ వెరైటీ ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే నోరెళ్లబెడుతారు.. ఇవేమి...

Tollywood Stars Food Habits: టాలీవుడ్ స్టార్స్ వెరైటీ ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే నోరెళ్లబెడుతారు.. ఇవేమి అలవాట్లు బాబోయ్..

Tollywood Stars Food Habits: మనం ఎంతగానో ఇష్టపడే సినీ తారలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల గురించి తెలుసుకోవాలనే ఆత్రుత, ఉత్సాహం మామూలు రేంజ్ ఉండదు. కానీ ఒక్కసారి వాళ్ళ అలవాట్లు తెలుసుకున్న తర్వాత , బాబోయ్ , వీళ్లేంటి ఇలా ఉన్నారు అని అనిపించక తప్పదు. ముఖ్యంగా వీళ్ళు తీసుకునే ఆహరం , వాటి కాంబినేషన్స్ ని చూస్తే ఇదెక్కడి పిచ్చి రా బాబు అని అనిపిస్తుంది. అలా వెరైటీ కాంబినేషన్స్ తో ఆహరం తీసుకునే కొంతమంది సినీ సెలబ్రిటీల గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాం.

రష్మిక మందాన :

ఆలు చిప్స్ ని చిన్నగా విరగ్గొట్టి , వాటిని నూడిల్స్ , పెరుగు లో వేసుకొని తినడం ఈమెకు అలవాటు అట. చిన్నప్పటి నుండి ఈ అలవాటు ఉందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది రష్మిక. అంతే కాదు ఈమెకు కుక్క బిస్కెట్లు తినే అలవాటు కూడా ఉందట. ఈ విషయాన్ని హీరో నితిన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్తాడు.

కృతి శెట్టి:

ఈమెకు సాఫ్ట్ సర్వ్ ఐస్ క్రీం ని , ఫ్రెంచ్ ఫ్రైస్ తో కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టమట. ఎంత ఇస్తామంటే , ఇదేంటి ఇలా తింటున్నావ్ అని అడిగేవాళ్ళని ఈమె దూరం పెట్టేస్తుందట. అంటే మనుషులను దూరం చేసుకోవడానికైనా సిద్ధం కానీ , తనకు ఉన్నటువంటి ఈ అలవాటు మాత్రం మార్చుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

మృణాల్ ఠాకూర్ :

తన స్నేహితురాలు ఇచ్చిన సలహాతో ఒకరోజు ఈమె వేడి అన్నం లో ఐస్ క్రీం కలుపుకొని తినిందట. రుచి చాలా బాగుందని , అప్పటి నుండి ఇది అలవాటుగా మారిపోయిందని ఈమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ప్రభాస్ :

రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత మంచి భోజన ప్రియుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ బయట ఎక్కడ పడితే అక్కడ తినే రకం కాదు. కేవలం ఇంట్లో వండిన వంటనే తింటాడట. షూటింగ్స్ ఏ ప్రాంతం లో ఉన్నా సరే , తన ఇంటి నుండి ఫుడ్ రావాల్సిందేనట. ఇక ఇతరులకు పొట్ట పగిలే రేంజ్ వడ్డించడంలో ప్రభాస్ కి ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

జాన్వీ కపూర్ :

ఈమెకు ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఐస్ క్రీం తినే అలవాటు ఉందట. అలా తింటే బాగా లావు పెరిగిపోతారు కదా, జాన్వీ కపూర్ అంత నాజూకుగా ఎలా కనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. అందుకు ఆమె వర్కౌట్స్ భారీ లెవెల్ లో చేస్తుందట.

ప్రియాంక చోప్రా :

ఈమెకు పచ్చడి అంటే పిచ్చి అట. ఎంత పిచ్చి అంటే భారతీయ వంటకాలతో పాటు, శాండ్ విచ్, పిజ్జా , చైనీస్ ఫుడ్ లో కూడా ఈమె పచ్చడి కలుపుకొని తింటుందట.

పూజా హెగ్డే :

ప్రాంతాన్ని బట్టీ మనం తీసుకునే ఆహరం మారుతూ ఉంటుంది. మన సౌత్ ఇండియా లో దొరికే ఆహరం , నార్త్ ఇండియా లో దొరకదు. కానీ పూజా హెగ్డే ఎక్కడికి వెళ్లినా , రోజులో ఒక్క పూట అయినా అన్నం , కూరగాయలతో భోజనం చేస్తుందట.

అజయ్ దేవగన్ :

ఈ బాలీవుడ్ స్టార్ చేతులతో భోజనం చేసే అలవాటు లేదట. ఎందుకంటే చేతులకు వాసన వస్తే ఈయనకు అసలు నచ్చదట. అందుకే ఎలాంటి ఆహారాన్ని అయినా ఈయన చేతులతో ముట్టుకోకుండా స్పూన్ / ఫోర్క్ తోనే తింటారు అట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular