Tollywood Star Heroes: సినిమా అంటే ఒక యుద్ధం…అది చేయడానికి మేము సిద్ధం గా ఉన్నామని చాలా మంది హీరోలు వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు…ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మన స్టార్ హీరోలు భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. నిజానికి కథలోని క్యారెక్టరైజైషన్స్ ను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఫిజికల్ గా గాని, మెంటల్ గా గాని ప్రిపేర్ అయినప్పుడే ఆ హీరో ఆ మూవీకి న్యాయం చేయగలుగుతాడు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… ఇక మన తెలుగు స్టార్ హీరోలందరు కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తున్నారు తప్ప కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల మీద ఫోకస్ చేయడం లేదు. కారణమేంటి అంటే ప్రతి ఒక్కరు స్టార్ హీరో సినిమాల్లో బీభత్సంగా కష్టపడి ఆ సినిమాను విజయ తీరాలకు చేర్చుతున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది.
ఎలాంటి కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్టార్ హీరోలు ఏ సినిమాలు చేస్తే అవే మనం చూడాలా? కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరు కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం లేదు.
ఇకమీదట రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి నటులు తలొక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తే ఈ ఓవర్ బడ్జెట్లు ఉండవు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు కలెక్షన్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఎప్పుడు గ్రాండియర్ ను చూపిస్తూ విజువల్ వండర్స్ గా మారుతున్న సినిమాలను చేయడం కాదు…
అప్పుడప్పుడు చిన్న సినిమాలను కూడా చేయాలి అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇతర భాషల్లో ఉన్న హీరోలందరు పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం మన హీరోలు ఎందుకని వెనుకబడి పోతున్నారనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు…