Nara Lokesh: మన దేశ ఐటీ రాజధానిగా బెంగళూరు నగరం పేరు పొందింది. సాధారణంగా ఎంత పెద్దది దిగ్గజ సంస్థ అయిన మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా బెంగళూరు నగరాన్ని చూస్తుంది. ఎందుకంటే బెంగళూరు నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ బహుళ జాతి సంస్థలు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ లో ఎన్ని విభాగాలు ఉంటాయో.. అన్ని విభాగాలు బెంగళూరు కేంద్రంగా సేవలు అందిస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం బెంగళూరు నగరంలో లక్షల మంది పనిచేస్తున్నారు. కేవలం కర్ణాటక వాసులు మాత్రమే కాకుండా.. మనదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు.. విదేశీయులు కూడా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఐటీ పరంగా.. మౌలిక వసతులపరంగా బెంగళూరు నగరం టాప్ లో ఉంటుంది. అటువంటి నగరాన్ని కాదని ఒక బహుళ జాతి సంస్థను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి తీసుకురావాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ప్రదర్శించారు నారా లోకేష్. ఏకంగా గూగుల్ సంస్థను విశాఖపట్నం నగరానికి తీసుకెళ్లారు. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా ఆ సంస్థను ఒప్పించారు. తద్వారా అమెరికా అవతల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడంలో లోకేష్ విజయవంతమయ్యారు. కేవలం గూగుల్ సంస్థతోనే లోకేష్ ఆగడం లేదు. అంతకుమించి అనే స్థాయిలో ఆయన ఇప్పుడు దూసుకుపోతున్నారు. స్వతహా గానే ఇంగ్లీష్ మీద లోకేష్ కు విపరీతమైన పట్టు ఉంటుంది. కార్పొరేట్ వ్యక్తులను ఆకర్షించి ప్రసంగించడంలో ఆయన దిట్ట. అందువల్లే విశాఖపట్నం నగరాన్ని ఐటి క్యాపిటల్గా మార్చబోతున్నారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ కు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో కృత్రిమ మేధకు రాజధానిగా విశాఖపట్నం నగరాన్ని చేయడంలో లోకేష్ శ్రమిస్తున్నారు.
లోకేష్ నెరిపిన మంత్రాంగం వల్ల కర్ణాటక రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇదే విషయాన్ని ఇటీవల కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించడం విశేషం. ఇక ప్రముఖ ఎంటర్ప్రైన్యూర్ ఆర్ ఇన్ క్యాపిటల్ కో ఫౌండర్ మోహన్ దాస్ పాయ్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. దాదాపు 1,35,000 కోట్ల ప్రత్యక్ష పెట్టుబడిని కర్ణాటక రాష్ట్రానికి దక్కకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ తీసుకెళ్లారని పేర్కొన్నారు. దాదాపు 15 బిలియన్ డాలర్ల విలువైన ఈ పెట్టుబడి మనదేశంలోనే అతిపెద్ద ఎస్ డీ ఐ అని మోహన్ దాస్ పేర్కొనడం విశేషం. ” నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇప్పుడు విశాఖపట్నం నగరానికి గూగుల్ వచ్చింది. ఇది భారతదేశానికి శుభవార్త. కర్ణాటక రాష్ట్రం దీనిని పొందలేకపోయింది. కర్ణాటక రాష్ట్రానికి కూడా సమాచార కేంద్రాల అవసరం ఉంది. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ బెంగళూరును మార్కెట్ చేయాలని అనుకుంటున్నారు. ఏ డబ్ల్యూ ఎస్, మెటాబంటి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ల వద్దకు వెళ్లి క్లౌడ్ సేవలను ఇక్కడికి తీసుకురావాలి. కర్ణాటక రాష్ట్రంలో చాలా కృత్రిమ మేధా కంపెనీలు ఉన్నాయి. అవి వచ్చే మూడు నాలుగు సంవత్సరాలలో విశాఖపట్నంలోని క్లౌడ్ కు అనుసంధానం కావాల్సి ఉంటుంది. అది తప్ప వేరే మార్గం లేదని” మోహన్ దాస్ పేర్కొన్నారు.
” విశాఖపట్నం లో గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రధాన కారణం సముద్ర ప్రాంతం ఉండడమే. సముద్ర ప్రాంతం నుంచి కేబుల్ తీసుకురావడానికి అవకాశం సులువుగా ఉంటుంది. కర్ణాటక ప్రాంతంలో కూడా కార్వార్ వద్ద కేబుల్ తీసుకొచ్చి బెంగళూరు లేదా చిక్బల్లాపూర్ లేదా కోలార్ ప్రాంతంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ పనిని కర్ణాటక ప్రభుత్వం చేయలేకపోయింది. పెట్టుబడులను ఆకర్షించడంలో.. ముఖ్యంగా కీలకమైన సమాచార కేంద్రాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడం లేదని” మోహన్ దాస్ పేర్కొన్నారు.
మోహన్ దాస్ ఈ మాటలు మాట్లాడిన తర్వాత వైసిపి ఒకసారిగా సైలెంట్ అయిపోయింది. దానికంటే ముందు గూగుల్ సీఈవో సుందర్ కూడా విశాఖపట్నం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం గూగుల్ తన సమాచార కేంద్రం ఏర్పాటుకు ఎందుకు ఎంచుకుందో వివరాలతో సహా వెల్లడించారు. అంతేకాదు, గూగుల్ విశాఖపట్నం వరకు రావడానికి నారా చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేశారు, నరేంద్ర మోడీ ఎంతటి సపోర్ట్ ఇచ్చారు, నారా లోకేష్ ఎలా వెంటపడ్డారు.. అనే విషయాలను పూర్తిగా వెల్లడించారు. దీనిని బట్టి వైసీపీ చెబుతున్న గుడ్డు స్టోరీ, గోదాం కథలు అన్నీ డొల్లే అని తేలిపోయింది.