Tollywood Heros Remuneration: మన స్టార్ హీరోల మొదటి రెమ్యునరేషన్ ఎంత..? ఇప్పుడంతా తీసుకుంటున్నారు..?

ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వాళ్ళు ఎంత తీసుకున్నారు ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు అనేదానిమీద కొందరు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల వాళ్లు ఎంతలా కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించిన వాళ్లం అవుతాం...

Written By: Gopi, Updated On : March 2, 2024 12:22 pm
Follow us on

Tollywood Heros Remuneration: ఒక వ్యక్తి ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్నాడు అంటే వాళ్లకి రెమ్యూనరేషన్ ఎంతగా ఉంటుందో అంటూ మన హీరోల అభిమానులు గానీ, ప్రేక్షకులు గానీ అందరూ దాని గురించి చర్చించుకుంటారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వాళ్ళు ఎంత తీసుకున్నారు ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు అనేదానిమీద కొందరు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల వాళ్లు ఎంతలా కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించిన వాళ్లం అవుతాం… అందుకోసమే మన హీరోల మొదటి రెమ్యునరేషన్ ఎంత ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ 1996వ సంవత్సరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాకి ఆయన 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఒక సినిమా కోసం ఆయన 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు…

మహేష్ బాబు
రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన మొదటి రెమ్యూనరేషన్ గా 10 లక్షల రూపాయలను తీసుకున్నారట. ఇక ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్తుతం 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ తను చేసిన మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని సినిమా కోసం 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడట.ఇక ఇప్పుడు ప్రతి సినిమాకి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు…

ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే తన మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమా కోసం 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడు…

అల్లు అర్జున్
గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తన మొదటి సినిమా కోసం 20 లక్ష రూపాయల వరకు తీసుకున్నాడట. ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

రామ్ చరణ్
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్…ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన చిరుత సినిమా కోసం దాదాపు 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట… ఇప్పుడు దాదాపు 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడట…

ఇక మన స్టార్ హీరోలు వాళ్ల మొదటి సినిమాకి ఇప్పుడున్న సినిమాలకి చాలా భారీగా ఎదిగారనే చెప్పాలి…