
Bichchagadu Movie : చిన్న సినిమాలుగా విడుదలై సంచలన విజయాలుగా నిల్చిన సౌత్ ఇండియన్ సినిమాలు ఎన్నో ఉన్నాయి.ఊహకి అందని అద్భుతాలను సృష్టించాయి కూడా,అలాంటి సినిమాలలో ఒక్కటే ‘బిచ్చగాడు’.ఆరోజుల్లో గుట్టుచప్పుడు కాకుండా విడుదలైన ఈ సినిమాకి మొదట్లో అసలు వసూళ్లే రాలేదు.ఆ టైటిల్ ని చూసి సగం జనాలు అసలు సినిమా చూడడానికి ఓపెనింగ్ లో ఏమాత్రం ఆసక్తి చూపలేదు.కానీ టాక్ పెరిగి సినిమా అద్భుతంగా ఉందని జనల నోర్లలో నానడంతో ఈ చిత్రానికి రెండవ వారం నుండి వసూళ్ల వరద కురిసింది.
అప్పట్లోనే ఏకంగా 28 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఈ సినిమాకి పోటీ గా అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా విడుదలైంది. కానీ బాక్స్ ఆఫీస్ పరంగా బిచ్చగాడు మేనియా ముందు నిలబడలేకపోయింది.అతి త్వరలోనే బిచ్చగాడు 2 రాబోతుంది.ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అదేమిటి అంటే ఈ చిత్రాన్ని తొలుత మన టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా తో తీద్దాం అనుకున్నాడట విజయ్ ఆంటోనీ.స్టోరీ రానా కి ఎంతో నచ్చింది కానీ,అప్పటికే ఆయన తన డేట్స్ మొత్తాన్ని బాహుబలి సినిమా కోసం కేటాయించేసాడు.
అందుకే ఈ చిత్రాన్ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది.ఇప్పటికీ ఈ సినిమాని మిస్ అయ్యినందుకు రానా బాధపడుతుంటాడట,ఒకవేళ ఆయన ఈ సినిమా చేసి ఉంటే అప్పట్లోనే 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉండేది, ఆయన కెరీర్ లో కూడా భారీ హిట్ గా నిలిచి ఉండేది, హీరో గా వేరే లెవెల్ తీసుకెళ్లి ఉండేది, కానీ పరిస్థితుల కారణం గా ఈ బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు రానా.