
Rashmika Mandanna : కన్నడ సినీ పరిశ్రమలో ‘కిరిక్ పార్టీ ‘ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడిన రష్మిక , ఆ తర్వాత టాలీవుడ్ లో చలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ,భీష్మ, పుష్ప వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి టాలీవుడ్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.
ఇక పుష్ప సినిమాతో ఈమెకి పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ క్రేజ్ వచ్చేసింది.ముఖ్యంగా బాలీవుడ్ లో ఈమె క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అవుతుంది.ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఆమె మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది.
ఎవరైనా ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా అంత దూరం రావడానికి ఎన్నో కష్టాలను అవమానాలను ఎదురుకోవాల్సి ఉంటుంది.రష్మిక కూడా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో అలాంటి అవమానాలనే ఎదురుకుందట..రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె వీటి గురించి ప్రస్తావించింది.ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి రావడానికి నేను మా ఇంట్లో వాళ్ళతో ఒక యుద్ధమే చేశాను. వాళ్లకి నేను అసలు సినిమాల్లోకి రావడమే ఇష్టం లేదు, కానీ నాకు సినిమా అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, ఇక ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత కొన్ని అవమానాలను ఎదురుకున్నాను, అవకాశాలు ఇవ్వాలంటే కొంతమంది దర్శకులు చాలా చీప్ గా మాట్లాడేవారు, వాటి అన్నిటిని తట్టుకొని సక్సెస్ అవ్వడానికి నాకు ఇంత సమయం పట్టింది’ అంటూ రష్మిక తన ఆవేదన వెళ్లగక్కింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.