Prabhas: ప్రబస్ ఆ మధ్య చాలా లావైపోయాడు. సలార్ సినమాలోని పాత్ర కోసం కొంచెం ఒళ్లు చేశాడు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ ముగిసింది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ లోనూ చాలా బొద్దుగా కనిపించాడు. బాలీవుడ్ మీడియా ఇదే విషయం అడిగితే.. “అవును.. ఈ మధ్య బాగా లావయ్యాను. అని నవ్వుతూ ‘త్వరలోనే తగ్గాలి. నా తదుపరి సినిమాకి కొత్త లుక్ లో కనిపిస్తాను“ అని ప్రభాస్ అప్పుడు క్లారిటీ ఇచ్చాడు.

సో.. ప్రభాస్ చెప్పాడు అంటే.. చేస్తాడు అని ఫ్యాన్స్ కూడా ఇన్నాళ్లు బాగా హోప్స్ తో ఎదురుచూశారు. అయితే.. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఇది వరకే చెప్పినట్టే… ప్రభాస్ ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాడు. గత నెలలో దాదాపు 9 కిలోలు బరువు తగ్గాడు. ఇప్పుడు ప్రభాస్.. మళ్లీ మునుపటి లుక్ కి వచ్చేశాడు. తాజాగా ప్రభాస్ కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది.
Also Read: Balakrishna and Nagarjuna: ప్చ్.. ‘బాలయ్య – నాగార్జున’లకు ఒకటే తేడా !
ఈ లుక్ చూసి… ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకొంటున్నారు. ప్రభాస్ మళ్లీ ఎప్పటిలాగే కనిపిస్తున్నాడు అని. ఇది తమకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తోంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాగ్ అశ్విన్ సినిమా విషయంలో ప్రభాస్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. తన పాత్రకు సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు.

పైగా నాగ్ అశ్విన్ ఈ ‘ప్రాజెక్ట్ కే’ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తీసుకువస్తున్నాడు. అన్నిటికి మించి ఈ సినిమాలో ‘బిగ్ బి అమితాబ్ బచ్చన్’ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అమితాబ్ పక్కన నటి రేఖ కూడా నటిస్తోంది. అందుకే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, నాగ్ అశ్విన్ ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు.
ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడు. మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.
Also Read:Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?
[…] […]