Heroine Harassment: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం…ఇక్కడ ప్రతి ఒక్కరు తమ సత్తా చాటుకొని సక్సెస్ ఫుల్ గా నిలవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి సక్సెస్ మాత్రం రాదు. ఇక్కడ సక్సెస్ అవ్వలంటే దానికోసం ఒక ఘోర తపస్సు చేయాలి. అనుక్షణం సినిమానే ప్రపంచంగా బ్రతకాలి. ఎంత కష్టాన్నైన సరే ఎదిరించగలిగే కెపాసిటి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో వాళ్ళ మనుగడని కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు… చాలామంది స్టార్ హీరోలు వాళ్ళను వాళ్లు ఒక శిల్పంలా చెక్కుకుంటూ ప్రేక్షకులు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకొని దాన్ని అందించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు… ఇక హీరోల కెరీర్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. హీరోయిన్ల కెరియర్ మహా అయితే ఒక 10 సంవత్సరాల వరకు ఉండచ్చు.
ఇక కొంతమంది హీరోలు హీరోయిన్ల విషయంలో చాలా కఠినంగా బిహేవ్ చేస్తారంటూ కొన్ని కథనాలైతే వెలువడుతూ ఉంటాయి. ఒక స్టార్ హీరో సైతం ఒక హీరోయిన్ మీద మనసు పడ్డాడట. తనకు సినిమాలో అవకాశం ఇవ్వాలంటే తనతో ఒక రోజంతా గడపాలని చెప్పాడట.
ఆయన పెట్టిన కండిషన్ కి ఆ హీరోయిన్ చిరాకు పడింది మొత్తానికైతే పక్కనున్న వాళ్లు ఆ హీరోయిన్ ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికి ఆమెకు చిరాకు పుట్టి ఆ హీరోని చెప్పుతో కొట్టి మరి అక్కడి నుంచి వచ్చేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటివి ఇండస్ట్రీ లో జరుగుతూనే ఉంటాయని ఎప్పటికప్పుడు కొన్ని వార్తలైతే వెలువడుతూ ఉంటాయి. మరి ఎందుకని ఇలాంటి విషయాల్లో కొంతమంది హీరోలు ఆసక్తి చూపిస్తారు అనేదే చర్చనీయాంశంగా మారింది.
ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది ప్రతి ఒక్కరికి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది వాళ్ల పర్సనల్ లైఫ్ ని సాఫీగా కొనసాగిస్తూ ప్రొఫెషనల్ పరంగా వచ్చేసరికి మాత్రం ఇలాంటి కండిషన్లు పెట్టడానికి గల కారణం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు…ఇలాంటి హీరోలు ఉండటం వల్లే ఇండస్ట్రీ పరువు పోతోందని మరి కొంత మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుంటడం విశేషం…