Amaravati Hotel Projects: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని చూస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. 12 ప్రధాన బ్యాంకు కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేసేందుకు కసరత్తు సాగుతోంది. మరోవైపు పర్యాటక, కార్పొరేట్ సంస్థలు సైతం తమ నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కార్పొరేట్ హోటల్ కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
* మంచి పేరు..
ఉమ్మడి ఏపీలో దస్పల్లా గ్రూప్ ఆఫ్ హోటల్స్ కు( daspalla Group of hotels ) మంచి చరిత్ర ఉంది. అమరావతిలో 200 కోట్ల రూపాయలతో 4 స్టార్ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చింది దస్పల్లా హోటల్ యాజమాన్యం. దీనికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోటల్కు ఇతర సంస్థల మాదిరిగానే పలు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతోంది. పన్నులతో పాటు విద్యుత్ చార్జీలలో మినహాయింపులు ఇచ్చింది. రాష్ట్ర పర్యాటక విధానం ప్రకారం ఈ అనుమతులు ఇచ్చారు.
* పర్యాటక రాయితీలు..
హైదరాబాద్ తో( Hyderabad) పాటు విశాఖలో దాస్పల్లా హోటల్స్ ఉన్నాయి. తాజాగా అమరావతిలో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ఆసక్తి చూపింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం పర్యాటక విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పదేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులతో పాటు స్టాంపు డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. పరిశ్రమల తరహాలో విద్యుత్ చార్జీల వసూలు, ఐదేళ్లకు విద్యుత్ సుంకం తిరిగి చెల్లింపునకు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ హోటల్ నిర్మాణం ద్వారా 400 మంది వరకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.