Rishab Shetty New Movie: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రిషబ్ శెట్టి(Rishab Shetty). ‘కాంతారా’ సిరీస్ తో ఆయన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించాడు. రెండు సినిమాలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర తిరగరాసిన రిషబ్ శెట్టి, ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తో పాటు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర లో కూడా నటిస్తున్నాడు. ఇలా హీరో గా తన కెరీర్ మొత్తం వెయ్యి కోట్ల ప్రాజెక్ట్స్ తో నింపేసుకున్నాడు. అయితే రిషబ్ శెట్టి గొప్ప నటుడు అయ్యి ఉండొచ్చు కానీ, అంతకంటే ముందు ఒక గొప్ప దర్శకుడు కూడా.
‘కాంతారా’ సిరీస్ కి దర్శకత్వం వహించింది ఆయనే. కన్నడ లో డైరెక్టర్ గా కాంతారా కి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కూడా అందుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరో గా బిజీ అయినప్పటికీ కూడా తనలోని డైరెక్టర్ ని వదిలిపెట్టలేదు. రీసెంట్ గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఒక కథ ని వినిపించాడట. ఆ కథ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చిందట. ప్రస్తుతం వీళ్లిద్దరికీ ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయ్యాక వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఏడాది పురస్కరించుకొని ఈ కాంబినేషన్ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయట.,స్వతహాగా రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని, అదే విధంగా మంచి స్నేహితుడు కూడా. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్నీ ఆయన చెప్పుకొచ్చాడు కూడా. అంతే కాదు ‘కాంతారా 2’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి ప్రస్తుతానికి ఆయన ఫోకస్ మొత్తం ప్రశాంత్ నీల్ సినిమా వైపే ఉంది. ఈ నెలాఖరు నుండి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఎన్టీఆర్ లుక్ కూడా ఈ చిత్రం లో వేరే లెవెల్ లో ఉంటుందట. ఈ సినిమా తర్వాత ఆయన జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు కాకుండా దేవర 2 మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో ఒక సినిమా ఉంది. ఈ చిత్రాలన్నీ పూర్తి అయ్యాకే ఆయన రిషబ్ శెట్టి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టే అవకాలు ఉన్నాయి.