Heart attacks in Children: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. దీంతో చాలామంది పిల్లల్లో గుండెపోటుతో బాధపడుతున్నారు. స్కూలు కెళ్లే విద్యార్థులు అనేక రకాల విషయాలతో బాధపడుతూ ఒత్తిడికి గురై ఆ తర్వాత ఈ ప్రభావం గుండెపై పడుతుంది. దీంతో గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే చిన్నపిల్లల్లో గుండెపోటు ఎక్కువగా రావడానికి తల్లిదండ్రుల ప్రవర్తనే అని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. వారికి కొన్ని అలవాట్లు చేయడంతో పాటు.. మరికొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురై గుండె సమస్యలను తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు ఈ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వారిని గుండెపోటు నుంచి రక్షించే అవకాశం ఉంటుంది. మరి ఆ విషయాలు ఏవో ఎప్పుడు చూద్దాం..
కొంతమంది తల్లిదండ్రులు ఉదయం పిల్లలను నిద్రలేపే సమయంలో చాలా రాష్ గా వ్యవహరిస్తారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ.. టైం అయింది అంటూ నిద్ర లేపుతారు. ఇలా నిద్ర లేపడం వల్ల వారిలో భయాందోళన పెరిగిపోతుంది. ఫలితంగా ఆ రోజంతా వారు ఒత్తిడితో కలిగి ఉంటారు. ఇలా మానసికంగా బాధపడుతూ గుండె సమస్యలను తెచ్చుకుంటారు.
మధ్యాహ్నం సమయంలో చాలామంది తల్లిదండ్రులు ఫ్రై ఫుడ్ పెడుతూ ఉంటారు. ఇలా మధ్యాహ్న సమయంలో ఫ్రైడ్ ఫుడ్ అందించడం వల్ల సరైన క్రమంలో జీర్ణం కాకుండా ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాకుండా ఇవి శరీరంలో అనేక సమస్యలను తీసుకువస్తాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సరిగా లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
చాలామంది స్కూల్ విద్యార్థులు ఇంటికి రాగానే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వెంటనే హోంవర్క్ చేస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు సైతం వారికి విశ్రాంతి ఇవ్వకుండా హోంవర్క్ చేయమని ఒత్తిడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని అవస్థలు పడతారు. దీంతో ఈ ప్రభావం గుండెపై పడుతుంది.
స్కూల్ పిల్లలు ఇంటికి రాగానే కనీసం గంట పాటు వారిని ఆడుకోనివ్వాలి. స్నేహితులతో ఆడుకోని ఇస్తే మరీ మంచిది. అలాకాకుండా వెంటనే వారికి హోంవర్క్ వంటి పనులను అప్పగించొద్దు. అంతేకాకుండా హోంవర్క్ చేయలేకపోతే వారికి అర్థమయ్యే విధంగా చెప్పి.. హోంవర్క్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయో వివరించాలి. అలాకాకుండా హోంవర్క్ చేయమని ఒత్తిడి చేస్తే భారీ గుండెపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలకువ ఉండకుండా చూడాలి. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు ఎక్కువ సేపు మెలకువ ఉంటూ మొబైల్ ను చూస్తూ గడుపుతున్నారు. ఇలా చేయడం వల్ల వారిలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ ఒత్తిడి అధికమై గుండెపై ప్రభావం పడి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఫలితంగా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు ఏదో ఒక ఒత్తిడితో ఉండే పిల్లలను వారంలో ఒకసారి అయినా పార్కు లేదా ఇతర ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారు మానసికంగా ప్రశాంతంగా భారీ ఒత్తిడి నుంచి దూరం అవుతారు. ఫలితంగా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.