Cheating Bride: నేటి కాలంలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. అందువల్లే చాలామంది అబ్బాయిలకు వివాహాలు జరగడం లేదు. ఈ క్రమంలో చాలామంది అబ్బాయిలు కులాల పట్టింపు లేకుండా.. ప్రాంతాల పట్టింపు లేకుండా.. కట్నాల పట్టింపు లేకుండా.. వివాహాలకు ఓకే చెబుతున్నారు. కొందరు అబ్బాయిలయితే ఎదురు కట్నం ఇచ్చి మరి వివాహాలు చేసుకుంటున్నారు.. ఇదే అదునుగా కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు.. వివాహాల పేరుతో నిండా ముంచుతున్నారు. అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆ యువకుడు బాగా చదువుకున్నవాడు.. ఆస్తి పరంగా కూడా పరవాలేదు.. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వయసు వచ్చినప్పటికీ వివాహం జరగడం లేదు.. బంధువులు , చుట్టుపక్కల వారు అందర్నీ ఎంక్వయిరీ చేసినప్పటికీ అతడికి ఒక్క మ్యాచ్ కూడా సెట్ కాలేదు. దీంతో తట్టుకోలేక మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు నమోదు చేశాడు. అతడు వివరాలకు తగ్గట్టుగా కొన్ని సంబంధాలను మ్యాట్రిమోనీ సైట్ వారు రిఫర్ చేశారు. ఈ క్రమంలోనే ఆ అబ్బాయి కోరుకున్న లక్షణాలు విజయవాడకు చెందిన యువతి లో ఉన్నాయి.. దీంతో ఆ యువకుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అబ్బాయి లక్షణాలు, ఇతర వ్యవహారాలను నచ్చడంతో అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి ఖాయం చేసుకున్నారు. విజయవాడ చెందిన అమ్మాయి తన ఇంటి వివరాలు, మిగతా విషయాలను అబ్బాయికి చెప్పడంలో కాస్త చాతుర్యాన్ని ప్రదర్శించింది. వివాహం జరుగుతుందనే తొందరలో ఆ యువకుడు అవన్నీ గమనించలేదు.
వాస్తవానికి వివాహం అమ్మాయి ఇంట్లో జరుగుతుంది. కొన్ని కులాలలో మాత్రం అబ్బాయిలు ఇండ్లలో జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి తమ కులానికి ఒక నిబంధన ఉందని.. నిశ్చయతాంబూలాలు, వివాహం అబ్బాయి ఇంట్లోనే జరుగుతుందని చెబితే దానికి ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఆదివారం అంగరంగ వైభవంగా వివాహం చేశారు. తమ స్థాయికి తగ్గట్టుగా పెళ్లికూతురు మీద కొంతమేర బంగారం కూడా పెట్టారు.. రెండు లక్షల నగదు కూడా ఆమె వద్ద ఉంచారు..
వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఫంక్షన్ హాల్ లో ఎవరి బిజీలో వారు ఉండగా.. పెళ్లికూతురు 2లక్షల నగదు, రెండు తులాల బంగారంతో పరార్ అయింది. అంతేకాదు తను వాడిన ఫోన్ కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.. సీసీ కెమెరాలో పరిశీలించగా ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యులతో వెళుతున్నట్టు కనిపించింది. పెళ్లి కుమారుడి తరఫు బంధువులు ఈ వ్యవహారం గురించి ఎంక్వయిరీ చేయగా అంతా ఫేక్ అని తేలింది. గతంలో ఈ యువతి ఇద్దరి యువకులను పెళ్లి పేరుతో మోసం చేసిందని.. పైగా వారి మీదనే ఉల్టా కేసులు పెట్టిందని తెలిసింది. అయితే ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది.. ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో ఉడాయించిన యువతి
రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పరార్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన విజయవాడకు చెందిన యువతి సంబంధం
యువతి తల్లిదండ్రులు, బంధువులు అంతా ఫేక్ అని ఆలస్యంగా తెలుసుకున్న… pic.twitter.com/DdBArkhxvk
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2025