Coolie: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటలలో రజినీకాంత్ ఒకరు. సూపర్ స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తను చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతుందనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేసి ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో భాగంగా సినిమా దర్శకుడు అయిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాతో ఎలాగైనా సరే రజనీకాంత్ తనదైన రీతిలో సత్తాని చాటుకొని ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ ఇంతకు ముందు విక్రమ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే సాధించాడో ఇప్పుడు మళ్ళీ కూలీ సినిమాతో కూడా అలాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో లోకేష్ కనకరాజ్ ఆలోచిస్తున్నాడు. ఇక దానికోసమే విపరీతమైన కసరత్తులు చేస్తూ ఈ సినిమాలో చాలామందిని భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే…
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కూడా ఒక క్యామియో రోల్ లో నటింపజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకీ ఆ నటుడు, దర్శకుడు ఎవరు అనే దాని మీద పలు ఆసక్తికరమైన అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి ఒక క్యామియో రోల్ పోషించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమైతే మాత్రం ఈ సినిమాకి భారీ రేంజ్ లో క్రేజ్ దక్కడం ఖాయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే రాజమౌళి రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో ఒక క్యామియో రోల్ పోషించాడు. ఆ రోల్ ప్రేక్షకులందరికి విపరీతంగా నచ్చింది. దాంతో లోకేష్ కనకరాజ్ కూడా రాజమౌళిని కూలీ సినిమాలో భాగం చేయాలనే ఉద్దేశ్యం తో ఆయన చేత ఒక క్యామియో రోల్ పోషింప చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో లోకేష్ కనక రాజ్ ఇటు రజినీకాంత్ తో భారీ సక్సెస్ ని సాధించాలని చాలా ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది…