Crazy Heroine: ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ముద్దుగుమ్మ కూడా ఈ కోవకు చెందిందే. ఈ చిన్నది తన కెరియర్ ప్రారంభంలో ఐటి దిగ్గజ కంపెనీ అయిన ఐబీఎం లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగుతోపాటు ఈ చిన్నది తమిళ్ సినిమాలలో కూడా అలరించింది. ఈమె స్కిన్ అశోకు చాలా దూరంగా ఉంటుంది. సినిమాలలో ఎక్కువగా హోంలీ పాత్రలే చేస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ కు పక్కింటి అమ్మాయి అనే ట్యాగ్ కూడా ఉంది. ఈ చిన్నది తెలుగులో వరుణ్ తేజ్, విక్రమ్, విశాల్ అలాగే సుధీర్ బాబు వంటి హీరోలతో నటించి మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం సినిమాలలో కాస్త స్లో అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. చాలామంది హీరోయిన్ల లాగానే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు చదువులో టాపర్. ఈమె బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేసింది.
Also Read: ఒకప్పుడు మిస్ ఇండియా.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను ఏలేస్తున్న హీరోయిన్…
ఆ తర్వాత బెంగళూరులోనే ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఐబీఎం లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసేది. ఉద్యోగం చేస్తూనే ఈ చిన్నది టిక్ టాక్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు గద్దల కొండ గణేష్ సినిమా హీరోయిన్స్ మృణాళిని రవి. మృణాళిని రవి ఐబీఎం లో జాబ్ మానేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఈ చిన్నది 2019లో రిలీజ్ అయిన సూపర్ డీలక్స్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడిగా గద్దల కొండ గణేష్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో మృణాళిని రవి బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఈమె తెలుగులో ఛాంపియన్, ఎనిమీ, కోబ్రా, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, రోమియో, మామ మశ్చింద్ర వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ కి చాలా ఫాలోయింగ్ ఉంది. కానీ ప్రస్తుతం ఈమె సినిమాలలో కాస్త స్లో అయింది. ఇప్పటివరకు తన తర్వాతి సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు.
View this post on Instagram