https://oktelugu.com/

Tollywood Record Collections: పేరుకు రికార్డు కలెక్షన్స్.. లాభాల లెక్కల్లో సోదిలో కూడా లేరు!

Tollywood Record Collections: 2020 సంవత్సరంలో కరోనా కష్టాలు పరిశ్రమను వెంటాడగా.. 2021ని అనేక ఆశలతో మొదలుపెట్టారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొన్ని సినిమాలు మరపురాని విజయాలు అందించి, పరిశ్రమకు తిరిగి ఊపిరి పోశాయి. క్రాక్, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి చిత్రాలు నిర్మాతల జేబులు నింపాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే 2021 హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన రెండు చిత్రాలు ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్య […]

Written By:
  • Shiva
  • , Updated On : December 31, 2021 / 11:03 AM IST
    Follow us on

    Tollywood Record Collections: 2020 సంవత్సరంలో కరోనా కష్టాలు పరిశ్రమను వెంటాడగా.. 2021ని అనేక ఆశలతో మొదలుపెట్టారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొన్ని సినిమాలు మరపురాని విజయాలు అందించి, పరిశ్రమకు తిరిగి ఊపిరి పోశాయి. క్రాక్, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి చిత్రాలు నిర్మాతల జేబులు నింపాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే 2021 హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన రెండు చిత్రాలు ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్య పరిచే అంశం.

    Tollywood Record Collections

    పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న విడుదలైంది. మూడేళ్ళ తర్వాత పవన్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ మూవీ కోసం ఎగబడ్డారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ అసలు కథకు కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మించారు.

    వకీల్ సాబ్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా లాభాలు తేలేకపోయింది. నైజామ్ లో బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న వకీల్ సాబ్ ఏపీలో మాత్రం చాలా ఏరియాలలో నష్టాలు తీసుకువచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం కూడా నష్టాలకు కారణమైంది. అలాగే టికెట్స్ ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి లేకపోవడం ఓపెనింగ్స్ పై ప్రభావం చూపింది. దాదాపు రూ. 135 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన వకీల్ సాబ్ 2021 సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే లాభాలు తెచ్చిన చిత్రాల జాబితాలో లేకుండా పోయింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇన్ స్పైర్ అతనే.. కథ అక్కడే మొదలైంది..: రాజమౌళి

    2021 టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది పుష్ప. మొదటి వారానికి పుష్ప రూ. 229 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్స్ విడుదల చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పుష్ప దాదాపు రూ. 102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజామ్ లో రూ. 37 కోట్లకు హక్కులు అమ్మారు. పది రోజులకు గాను 34 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో నైజాంలో పుష్ప బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. ఏపీలో మాత్రం పుష్ప పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ఈ మూవీ 60% శాతం పెట్టుబడి వరకు రాబట్టినట్లు సమాచారం. 40% శాతం మేర డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు చవి చూసే పరిస్థితి.

    కాగా డబ్బింగ్ మూవీ మాస్టర్ లాభాలు పంచడం విశేషం. రీజనబుల్ వసూళ్లు అందుకున్న విజయ్ మాస్టర్ రన్ ముగిసే నాటికి దాదాపు 6 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. 2021 హైయెస్ట్ గ్రాసర్స్ గా ఉన్న పుష్ప, వకీల్ సాబ్ మాత్రం బయ్యర్లకు నష్టాలు మిగిల్చాయి.

    Also Read: నేచురల్ స్టార్ నాని గాలి తీసిన ఎమ్మెల్యే రోజా..

    Tags