Pawan kalyan Producers: పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు: కర్ర విరగకుండా పాము చచ్చేలా?

Pawan kalyan Producers: ఏమో ఈ పాలిటిక్స్ ఏందో.. ఈ సినిమా ఇండస్ట్రీకి ఆ లింకులు ఏంటో మధ్యలో ‘ఫాఫం నిర్మాతలు’ చస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ కు మధ్యలో తెలుగు నిర్మాతలు నలిగిపోతున్నారు. అటు ప్రభుత్వానికి సర్ది చెప్పలేక.. ఇటు పవన్ ను కంట్రోల్ చేయలేక ఆపసోపాలు పడుతున్నట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.. ‘రిపబ్లిక్’ మూవీ వేడుక సాక్షిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై రెచ్చిపోయారు. సినీ నిర్మాతలు […]

Written By: NARESH, Updated On : October 1, 2021 2:31 pm
Follow us on

Pawan kalyan Producers: ఏమో ఈ పాలిటిక్స్ ఏందో.. ఈ సినిమా ఇండస్ట్రీకి ఆ లింకులు ఏంటో మధ్యలో ‘ఫాఫం నిర్మాతలు’ చస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ కు మధ్యలో తెలుగు నిర్మాతలు నలిగిపోతున్నారు. అటు ప్రభుత్వానికి సర్ది చెప్పలేక.. ఇటు పవన్ ను కంట్రోల్ చేయలేక ఆపసోపాలు పడుతున్నట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది..

‘రిపబ్లిక్’ మూవీ వేడుక సాక్షిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై రెచ్చిపోయారు. సినీ నిర్మాతలు వచ్చి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ పై తన వద్ద గోడు వెళ్లబోసుకున్నారని.. ఇది అన్యాయం అని.. ఏపీ ప్రభుత్వాన్ని కడిగేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యి మంత్రులు భగ్గుమనడంతో వారిని చల్లార్చేందుకు హైదరాబాద్ నుంచి తెలుగు సినిమా నిర్మాతలంతా అమరావతికి వెళ్లారు. ఏపీ మంత్రి పేర్ని నాని ఇంటికెళ్లి మరీ సర్దిచెప్పి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని.. అవి ఆయన వ్యక్తిగతం అని తేల్చిచెప్పారు.

మరి దానికి కట్టుబడి ఉండొచ్చు కదా.. కానీ అలా చేయలేదు. పవన్ వ్యాఖ్యలకు, టాలీవుడ్ కు సంబంధం లేదన్న నిర్మాతలు తాజాగా పవన్ ఇంటికెళ్లి మరీ ఆయనను కలవడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ ను ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి. అయితే ఇదే సినీ నిర్మాతలు చేసిన తప్పు అని అంటున్నారు.

ఎవరిని వెర్రివాళ్లను చేయడానికి ఈ కలయిక చేశారో కానీ.. ఇప్పుడు నిర్మాతలు ‘కర్ర విరగకుండా పాముచచ్చేలా’ వ్యవహరించిన తీరు మాత్రం చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చి సైలెంట్ గా ఉంటే అయిపోయేది. కానీ ఇప్పుడు పవన్ ను టాలీవుడ్ నిర్మాతలంతా కలవడం వైసీపీ వర్గాలను షాక్ కు గురిచేసిందంటున్నారు. నిర్మాతల తీరు ఏపీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా ఉందంటున్నారు. అటు ఏపీ ప్రభుత్వానికి మద్దతిచ్చి.. ఇటు పవన్ కళ్యాణ్ ను కలిసి నిర్మాతలు ఎటూ నొప్పించకుండా వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.. పవన్ అంటే మండిపడుతున్న ఏపీ వైసీపీ పెద్దలకు.. ఇప్పుడు నిర్మాతలు వ్యవహరించిన తీరు మింగుడుపడుతుందో లేదో చూడాలి మరీ..