OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. జాతీయ ఉత్తమ నటి విద్యాబాలన్ నటించిన తాజా చిత్రం ‘జల్సా’. విద్యాబాలన్‌తో పాటు షెఫాలీ షా కీలక పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ డ్రామాను సురేష్ త్రివేణి తెరకెక్కించారు. ఈ మూవీ మార్చి 18న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా విద్యాబాలన్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మూవీలోని తన పాత్ర పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. ‘అసలు కథ ఆమె చిరునవ్వు వెనుక దాగి ఉంది’ అని పేర్కొంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఓటీటీ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 17మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న బిగ్‌బాస్ ఓటీటీ షో ప్రారంభమైంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈసారి శనివారం మాత్రమే స్క్రీన్‌పై కనిపించనున్నాడు. గత సీజన్‌కు 10 నుంచి 12కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న నాగార్జున ఈసారి ఓటీటీ హోస్టింగ్ కోసం రూ.8-9కోట్ల మేర తీసుకున్నట్లు సమాచారం.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైరయ్యారు. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్‌రాజ్‌కి సూచించారు. ఇందిరా పార్క్‌లో ఓసారి చూడాలని, బుద్ధి, జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు అని మండిపడ్డారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్‌కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా అంటూ ధ్వజమెత్తారు. మరి ప్రకాష్ రాజ్ ఈ విమర్శల పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Also Read: భీమ్లా నాయక్ సినిమా నుంచి ‘అంత ఇష్టం ఏందయ్యా’ పాటని ఎందుకు కట్ చేసారంటే ?