https://oktelugu.com/

Pawan Kalyan Hari Hara Veera Mallu: పవన్ సినిమా సెట్స్ కోసం 10 కోట్లు

Pawan Kalyan Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదిరిపోయే సెట్స్ వేయబోతున్నారని. ఢిల్లీలోని చాందినీ చౌక్ ను రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకోసం 10 కోట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 24, 2022 / 11:53 AM IST
    Follow us on

    Pawan Kalyan Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదిరిపోయే సెట్స్ వేయబోతున్నారని. ఢిల్లీలోని చాందినీ చౌక్ ను రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు.

    Pawan Kalyan Hari Hara Veera Mallu

    కాగా భారీగా ఉండే చాందినీ చౌక్ సెట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. అన్నట్టు ఈ సెట్ లోనే పవన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది.

    Also Read:   ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్: పవన్ కు షాక్.. టీఆర్ఎస్ సర్కార్ ప్రమోషన్ కు వాడుకుందా?

    మొత్తమ్మీద పవన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ వస్తున్నాడు. మొదటిసారి.. ‘హరిహర వీరమల్లు’ సినిమాకి మాత్రం వరుసగా 25 రోజులు డేట్స్ ఇచ్చాడు. నిజానికి మొదటి నుంచీ ఈ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా.

    Pawan Kalyan

     

    కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. అలాగే నటీనటుల మేకప్ కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే లేట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఇలా బల్క్ డేట్స్ ఇవ్వడం మంచి పరిణామం. అన్నట్టు రేపు పవన్ సినిమా రిలీజ్ కానుంది.

    Also Read:  అజిత్ ‘వలీమై’ యూఎస్ ప్రీమియర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

    Tags