OKTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలయ్య బాబుతో సినిమా తీయాలని దర్శకుడు పరుశురామ్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న పరుశురామ్.. గతంలో బాలయ్యకు చెప్పిన కథను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య బాబుతో సినిమా ఉంటుందని పరుశురామ్ తన సన్నిహితులకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
OKTelugu Movie Time
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘రావణాసుర’ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. తొలిరోజు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని మెసేజ్ చేస్తూ.. రవితేజ, షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.
Ravi Teja
Also Read: కూతురి విడాకుల పై రజినీకాంత్ స్పందన !
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. చింతామణి నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. నాటకంలో ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే మొత్తం ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది. అలాగే చింతామణి పుస్తకం నిషేధించనప్పుడు నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
మొత్తానికి దీనిపై ప్రభుత్వానికి వచ్చిన రిప్రజెంటేషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ చింతామణి నాటకాన్ని ఎలా నిషేధిస్తారు ? అంటూ నెటిజన్లు కూడా ఇప్పటికే చాలాసార్లు ప్రశ్నించారు.
Also Read: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ బాగుంది !