https://oktelugu.com/

Tollywood Movies Which Leaked: రిలీజ్ కి ముందే లీక్.. రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్స్‌.. ఇండస్ట్రీని నిలబెట్టిన సినిమాలివే !

Tollywood Movies Which Leaked : టెక్నాలజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకన్నా నష్టాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఒక సినిమా ఎడిటింగ్ వర్క్ కోసం టెక్నీషియన్స్ కి వర్క్ ఇస్తే.. ఆ టెక్నీషియన్స్ అదే టెక్నాలజీని యూజ్ చేసుకోని, చివరకు ఆ సినిమా రిలీజ్ కి ముందే పైరసీ చేసి ఆ వీడియోస్ ని వాట్సాప్, ఇతర సోర్సెస్ ద్వారా అందరికి […]

Written By:
  • Shiva
  • , Updated On : May 2, 2022 / 03:11 PM IST
    Follow us on

    Tollywood Movies Which Leaked : టెక్నాలజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకన్నా నష్టాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఒక సినిమా ఎడిటింగ్ వర్క్ కోసం టెక్నీషియన్స్ కి వర్క్ ఇస్తే.. ఆ టెక్నీషియన్స్ అదే టెక్నాలజీని యూజ్ చేసుకోని, చివరకు ఆ సినిమా రిలీజ్ కి ముందే పైరసీ చేసి ఆ వీడియోస్ ని వాట్సాప్, ఇతర సోర్సెస్ ద్వారా అందరికి షేర్ చేయడం ఎంత దారుణం ?

    ఒక సినిమా తీయడానికి చాలా టైమ్ పడుతుంది, కానీ ఆ సినిమా పైరసీ చేసి షేర్ చేయడానికి సెకన్ల వ్యవధి చాలు. అదే చేశారు. దీనివల్ల నిర్మాతలకు చాలా నష్టం జరుగుతోంది. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా “బాహుబలి” కూడా ఈ పైరసీ సమస్య ని ఫేస్ చేసింది. అలాగే, ఈ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏమిటో తెలుసుకుందాం.

    Also Read: Hansika: బికినీలో ‘హన్సిక’.. హద్దులు దాటిన అందాలు !

    ‘గీత గోవిందం’ :

    Tollywood Movies

    విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమాలో కొన్ని సీన్స్ సినిమా రిలీజ్ కి ముందే థర్డ్ పార్టీ ఎడిటర్ ద్వారా పైరసీ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    “బాహుబలి” :

     

    Baahubali

    ఇండియన్ సినిమా హిస్టరీలో ఎపిక్ మూవీగా నిలిచిపోయింది “బాహుబలి”. ఐతే, ఈ మూవీ ఎడిటింగ్ ప్రాసెస్ లో ఉన్న సమయంలోనే.. ఒక అసిస్టెంట్ ఎడిటర్ క్లైమాక్స్ లో వచ్చే వార్ ఎపిసోడ్ ను మొబైల్ లో రికార్డు చేసి.. దాన్ని ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. అది బాగా వైరల్ అయ్యింది..

    అత్తారింటికి దారేది :

     

    Attarintiki Daredi

    ‘అత్తారింటికి దారేది’, ఈ సినిమాలో ఒక సీన్ లేదా ఒక పాట కాదు.. ఏకంగా ఈ సినిమాలో సగం పార్ట్ నే పైరసీ చేశారు. అది కూడా హెచ్‌డి క్లారిటీతో. అయినా కూడా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గ్రాస్ అండ్ షేర్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

    మగధీర :

    Magadheera

    రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. కానీ, అంతకు ముందే ఈ సినిమాలో కొన్ని క్లిప్పింగ్ లను పైరసీ చేశారు.

    శంకర్ దాదా M.B.B.S. :

    Shankar Dada M.B.B.S.

    ‘మున్నా భాయ్’ రీమేక్ గా చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయింది. దాంతో, ఈ సినిమా రిలీజ్ కి ముందు కొన్ని క్లిప్పింగ్స్ ను పైరసీ చేశారు.

    ఎవడు :

    Yevadu

    వంశీ పైడిపల్లి, చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా క్లిప్పింగ్స్‌తో పాటు కొన్ని సీన్స్ కూడా సినిమా రిలీజ్ కి ముందే నెట్‌ లో హల్చల్ చేశాయి.

    బాహుబలి 2 :

    Baahubali 2

    ఫస్ట్ పార్ట్ లో వార్ సీన్స్ పైరసీ అయినట్టే.. ఈ సినిమా సెకండ్ పార్ట్ లో కూడా ఏకంగా 50 నిమిషాల సినిమాని పైరసీ చేశారు. ఈ కేస్ లో పోలీస్ లు యాక్షన్ తీసుకుని కొంత మందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ, అప్పటికే పైరసీ వీడియోలు గరిష్టంగా అందరికీ చేరాయి. కానీ ఈ పైరసీ, ఈ సినిమా కలెక్షన్లను మాత్రం ఆపలేకపోయింది.

    జై లవకుశ :

    Jai Lava Kusa

    తొలిసారి తారక్ ట్రిపుల్ రోల్ ప్లే చేసిన ‘జై లవకుశ’ సినిమాకి చాలా బాగా హైప్ వచ్చింది. భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఐతే.. ఈ సినిమా ప్రొడక్షన్ టీమ్ అఫీషియల్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేద్దాం అనుకున్న టైమ్ లో.. ముందే పైరసీ టీమ్ ఎన్టీఆర్ ‘జై’ క్యారెక్టర్ పోస్టర్స్ ని ఇంటర్నెట్ లో లీక్ చేశారు.

    అరవింద సమేత వీర రాఘవ :

    Aravinda Sametha Veera Raghava

    తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో తారక్ – నాగబాబు మధ్య వచ్చే ముఖ్యమైన సన్నివేశాలను ఇంటర్నెట్ లో లీక్ చేశారు పైరసీ బాబులు. మొత్తానికి ఈ సినిమాలు పైరసీ బారిన పడిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

    Also Read:Dil Raju vs Warangal Srinu: దిల్ రాజుకి మళ్లీ ఘోర అవమానం.. అసలు ఏం జరిగింది అంటే ?

    Recommended Videos


    Tags