Homeట్రెండింగ్ న్యూస్UK Man Drinks Own Urine Daily: 10 ఏళ్లుగా యవ్వన రహస్యం మూత్రమట.. స్టోర్...

UK Man Drinks Own Urine Daily: 10 ఏళ్లుగా యవ్వన రహస్యం మూత్రమట.. స్టోర్ చేసుకొని మరీ తాగుతున్నాడే!

UK Man Drinks Own Urine Daily: ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలా మంది నిత్యం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు చాలామంది ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం, యోగా, డైట్‌ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కానీ ఓ వ్యక్తి చాలా విచిత్రంగా మూత్రం(యూరిన్ ) తాగడం వల్ల తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. మానసిక ఒత్తిడిని సైతం జయించినట్లు పేర్కొన్నాడు. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మెటాడీన్‌..

UK Man Drinks Own Urine Daily
UK Man Drinks Own Urine Daily

యూకేలోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ 2016 నుంచి ఇప్పటి వరకు రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల దాదాపు 10 ఏళ్లు యంగ్‌గా కనిపిస్తున్నట్లు పేర్కొంటున్నాడు. గతంలో తనకు మానసిక సమస్యలను ఎదురవ్వగా వాటి నుంచి బయట పడేందుకు ఈ ‘యూరిన్ థెరపీ’ ప్రారంభించినట్లు తెలిపాడు. దీంతో తనకు శాంతి, ప్రశాంతత వంటి కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. అప్పటి నుంచి సొంత మూత్రాన్ని తాగుతున్నట్లు చెప్పాడు.

Also Read: Tollywood Movies Which Leaked: రిలీజ్ కి ముందే లీక్.. రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్స్‌.. ఇండస్ట్రీని నిలబెట్టిన సినిమాలివే !

– బాటిల్స్‌లో స్టోర్‌ చేసుకొని..
తన మూత్రాన్ని బాటిల్స్‌లో స్టోర్‌ చేసుకొని.. రోజుకో 200 మి. లీ చొప్పున తాగుతుంటాడు. మూత్రాన్ని బాటిల్స్‌లో నింపి.. రెండు మూడు నెలల తర్వాత తాగుతున్నట్లు తెలిపాడు. దీనిని తాగినప్పుడు ఎంతో శక్తివంతంగా ఉంటుందని, ఒత్తిడి దూరమై, మెదడు చురుకుగా పనిచేస్తుందని హ్యరీ తెలిపాడు. అలాగే మూత్రాన్ని మాయిశ్చరైజర్‌గా తన ముఖానికి మసాజ్‌ చేస్తానని కూడా వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల తన చర్మం యవ్వనంగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుందంటున్నాడు. ఇక 90 శాతం నీరు ఉన్న మూత్రానికి శరీరంలో ఉన్న అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందని హ్యారీ విశ్వసిస్తున్నాడు.

UK Man Drinks Own Urine Daily
UK Man Drinks Own Urine Daily

-ఎంతో మేలు జరిగిందని..
మూత్రం తాగడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అలవాటును మార్చుకోనని చెబుతున్నాడు. దీనిని తయారు చేసేందుకు ఖర్చుకూడా లేకపోవడంతోపాటు నిత్య మూత్రం తాగడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయని చెప్పారు. కాగా గతంలో సింగర్స్‌ మడోన్నా, కేషా కూడా మూత్రం తాగుతామని వెల్లడించారు.

UK Man Drinks Own Urine Daily
UK Man Drinks Own Urine Daily

-ప్రమాదమంటున్న వైద్యులు..
మూత్రం తాగడాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. మూత్రం తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ పెరుగుతుందని.. బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు. యూరిన్‌ అంటేనే శరీరంలోని వ్యర్థాలు బయటకు వస్తాయన్నారు. అలాంటి ద్రవాన్ని మళ్లీ నోటిద్వారా శరీరంలోకి తీసుకోవడం ద్వారా లాభాల సంగతి అటుంచి కొత్త రకమైన వ్యాధులు ఉంటాయని చెబుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు. ఎప్పుడో ఒకసారి తప్పనిసరై తాగడం వేరని, నిత్యం ఏళ్ల తరబడి తాగడం వలన దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు.

Also Read:YS Jagan Illegal Assets Case: అక్రమాస్తుల కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version