Jabardasth Pavithra: జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో పవిత్ర ఒకరనే సంగతి తెలిసిందే. మొదట్లో జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్లు కనిపించే వాళ్లు కాదు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా జబర్దస్త్ నిర్వాహకులు లేడీ కమెడియన్లకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. జబర్దస్త్ షోలో తక్కువ స్కిట్లే చేసినా పవిత్రకు ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చింది.

పవిత్ర హైట్ తక్కువ కావడంతో జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్లు ఆమె హైట్ గురించి పంచ్ లు వేస్తుండగా ఆ పంచ్ లు భలే పేలుతున్నాయి. ఒకవైపు జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తూనే మరోవైపు ఈటీవీ సీరియల్స్ లో కూడా ఈ బ్యూటీ అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కడంతో జబర్దస్త్ షోలో పవిత్రకు అవకాశాలు వచ్చాయి.
Also Read: హీరో అరవింద్ స్వామి భార్య సంపాదన ఎంతో తెలుసా.. నెలకు అన్ని కోట్లా..!
హైపర్ ఆది, వెంకీ మంకీస్, మరి కొందరు టీమ్ లీడర్ల టీమ్ లో పవిత్ర పని చేసింది. తక్కువ కాలంలోనే పవిత్రకు ఊహించని స్థాయిలో క్రేజ్ రావడంతో ఈమె జబర్దస్త్ లోనే మరి కొన్నేళ్ల పాటు కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జబర్దస్త్ కు ముందు కొన్ని సీరియళ్లలో నటించినా పవిత్రకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. జబర్దస్త్ తర్వాత మాత్రం పవిత్రకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి.
Also Read: హీరోయిన్ గౌతమి మొదటి భర్త ఎవరో మీకు తెలుసా.. మనందరికీ సుపరిచితుడే..!
భవిష్యత్తులో పవిత్రకు సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కే ఛాన్స్ అయితే ఉంది. సినిమా ఆఫర్ల విషయంలో పవిత్ర ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. పవిత్రకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
Also Read:
1. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ జాబ్ వదిలేసి.. అమ్మతో ఇడ్లీ హోటల్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు!
2. జగన్ కొట్టలేదట.. నమ్మండి అంటున్నాడు..
[…] Also Read: జబర్దస్త్ కమెడియన్ పవిత్ర గురించి ఈ… […]