Megastar Review On Kondapolam: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను ఆధారంగా చేసుకుని జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో, వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీతీ సింగ్ జంటగా నటించిన చిత్రం కొండపొలం. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నటీనటులతో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ‘కొండపొలం’ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ క్రిష్. తొలిసినిమా ఉప్పెనతోనే వెండితెరపై మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ తేజ్ శుక్రవారం ఈ వినూత్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా నిన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సినిమాను టీం సభ్యులతో కలిసి ప్రీమియర్ షో చూశారు. అనంతరం సినిమా టీం సభ్యులను మెచ్చుకుని వారికి అభినందనలు తెలియజేశారు.
మెగాస్టార్ మాట్లాడుతూ డైరెక్టర్ క్రిష్ సినిమాలు విభిన్నంగా ఉంటాయని, అందుకే అతని సినిమాలు చూసిన ప్రతిఒక్కరు థ్రిల్‌కు లోనవుతారని తెలిపాడు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామ ఇలా డైరెక్టర్ క్రిష్ గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నానని చెప్పాడని, నేనే అయితే ఆ పుస్తకం చదవలేదు కానీ, నువ్వు వెంటనే ఆ సినిమా చెయ్ అని చెప్పానన్నారు. అతని డైరెక్షన్‌లో సినిమా చేస్తే కళాకారుల నుంచి అద్భుతమైన నటనను వెలికితీస్తాడని, ప్రతి సినిమాను శక్తివంతంగా రూపొందిస్తాడని చిరు అన్నారు. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచే చూస్తూ వస్తున్నానని, ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదన్నారు.
చిత్ర విషయానికి వస్తే గత చిత్రాల కంటే వ్యత్యాసంగా ఉందని, చక్కటి పల్లెటూరి లవ్‌స్టోరి అని, దీనితో పాటు ఈ ప్రకృతిని కూడా ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం ఉన్న చిత్రం అని తెలిపారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటనకు మంచి స్కోప్ ఉన్న సినిమా అని, వారి నటనను తాను బాగా ఎంజాయ్ చేశాన్నారు మెగాస్టార్. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. క్రిష్‌కు, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు చిరు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Tollywood megastar chiranjeevi first review on kondapolam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com