Homeఎంటర్టైన్మెంట్Balakrishna - Boyapati : బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న 4వ చిత్రంలో విలన్...

Balakrishna – Boyapati : బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న 4వ చిత్రంలో విలన్ గా టాలీవుడ్ మాస్ హీరో.. త్వరలోనే అధికారిక ప్రకటన!

Balakrishna – Boyapati : టాలీవుడ్ లో కొన్ని ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ నుండి పొరపాటున కూడా ఫ్లాప్ సినిమాలను ఊహించలేము. ఎందుకంటే ఫ్లాప్ అనే పదమే ఎరుగని కాంబినేషన్స్ అవి. అలాంటి కాంబినేషన్స్ లో మన ఇండస్ట్రీ లో బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలియిక లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోకుంటే ఎలా. వరుస ఫ్లాప్స్ లో ఉన్న బాలయ్య కి బోయపాటి శ్రీను ‘సింహా’ చిత్రంతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అయ్యే హిట్ ని ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య కి వరుస ఫ్లాప్స్ వచ్చాయి, అలాంటి సమయంలో ఆయనకి ‘లెజెండ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక కెరీర్ అయిపోయింది, తీసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అని బాలయ్య అభిమానులు బాధపడుతున్న సమయంలో ‘అఖండ’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అఖండ తర్వాత ఆయన కెరీర్ ఎలా మారిపోయిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.

అప్పుడప్పుడు మాత్రమే హిట్లు కొట్టే అలవాటు ఉన్న బాలయ్య, ఇప్పుడు వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అభిమానులకు అంకితం చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య 5 దశాబ్దాల సినీ కెరీర్ లో ఇలాంటి గోల్డెన్ ఫేస్ ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే బాలయ్య – బోయపాటి శ్రీను కలిసి నాల్గవసారి జత కట్టబోతున్నారు. ఈసారి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గత మూడు చిత్రాలను మైమరపించేలా ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య. అయితే ఈ సినిమాలో విలన్ కూడా చాలా పవర్ ఫుల్, అందుకోసం బోయపాటి శ్రీను మ్యాచో స్టార్ గోపీచంద్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్ హీరో గా సక్సెస్ అయ్యే ముందు విలన్ గానే బాగా ఫేమస్ అయ్యాడు. జయం, వర్షం, నిజం వంటి చిత్రాలలో గోపీచంద్ చూపించిన విలనిజం మామూలుది కాదు. ఆడియన్స్ కూడా భయపడ్డారు, హీరోలను సైతం ఆయన డామినేట్ చేసేవాడు. ఆ తర్వాత యజ్ఞం నుండి హీరోగా మారిన గోపీచంద్, హీరో గా హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయంలోనే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

అయితే హీరోగా ఈమధ్య గోపీచంద్ టైం అసలు బాగుండడం లేదు, ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బ తినింది, ఇలాంటి సమయంలో ఆయన విలన్ గా బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సరైన నిర్ణయం అని అంటున్నారు ఆయన అభిమానులు సైతం. ‘లెజెండ్’ చిత్రంలో మొట్టమొదటిసారి జగపతి బాబు ని విలన్ గా చూపించాడు బోయపాటి, ఇక ఆ చిత్రం తర్వాత ఆయన కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు గోపీచంద్ ని విలన్ గా మరోసారి ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడు బోయపాటి, ఆయన కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version