https://oktelugu.com/

Kriti Shetty and Sreeleela: కృతి శెట్టి-శ్రీలీలను పట్టించుకోని టాలీవుడ్ మేకర్స్… అందుకు సిద్ధంగా ఉన్నా నో ఛాన్స్!

కృతి శెట్టి కి డిమాండ్ పెరిగింది. ఏకంగా రూ. 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచేసింది. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 15, 2024 / 09:59 AM IST

    Krithi-Shetty-Sreeleela

    Follow us on

    Kriti Shetty and Sreeleela: కన్నడ భామలు కృతి శెట్టి-శ్రీలీల లకు బ్యాడ్ టైం నడుస్తుంది. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డారు. వాళ్ళను టాలీవుడ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కృతి శెట్టి, శ్రీలీల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది కృతి శెట్టి. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించింది. యంగ్ బ్యూటీ గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో కృతి శెట్టి నటన, లుక్స్ మెస్మరైజ్ చేశాయి. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ లో నటించింది. శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ కొట్టింది. నాగ చైతన్య తో కలిసి నటించిన బంగార్రాజు తో హ్యాట్రిక్ పూర్తి చేసింది.

    దీంతో కృతి శెట్టి కి డిమాండ్ పెరిగింది. ఏకంగా రూ. 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచేసింది. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి చెప్పాలి, వారియర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. నాగ చైతన్య తో చేసిన కస్టడీ సైతం డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో కృతి శెట్టికి ఆఫర్స్ తగ్గాయి.

    ఇక శ్రీలీల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ భామ ఒకేసారి అరడజను చిత్రాల పైగా సైన్ చేసింది. వాటిలో హిట్ అయ్యింది మాత్రం ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే. గుంటూరు కారం చిత్రంపై ఆశలు పెట్టుకుంటే అది కూడా నిరాశపరిచింది. పైగా ఆమె పాత్రకు పెద్దగా పేరు రాలేదు. శ్రీలీల చేతిలో ఉన్న ఒకే ఒక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడింది. శ్రీలీల, కృతి శెట్టి కెరీర్స్ సంక్షోభంలో ఉండగా… ఇద్దరూ రెమ్యూనరేషన్స్ తగ్గించేశారట. అలాగే గ్లామర్ షోకి సిద్ధం అంటున్నారట. అయినప్పటికీ ఆఫర్స్ రావడం లేదట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.