Homeఎంటర్టైన్మెంట్Amar Singh Chamkila OTT Review : ఓ బూతు గాయకుడి బయోపిక్.. ఎందుకింత...

Amar Singh Chamkila OTT Review : ఓ బూతు గాయకుడి బయోపిక్.. ఎందుకింత హిట్ అయ్యింది..? ఏంటా కథ..?

Amar Singh Chamkila OTT Review : ఒక సినిమా తీయాలంటే దర్శకుడికి దర్శకత్వ శాఖ లో ప్రతిభా అనేది ఉండాలి. ఇక నార్మల్ ఫిక్షన్ కథలను సినిమాలుగా చేయడానికి దర్శకుడు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ అయిన తీసుకోవచ్చు. కానీ ఒక బయోపిక్ సినిమా చేయాలంటే దానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేయాల్సి ఉంటుంది. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా దానికి ఆ దర్శకుడు గానీ ఆ సినిమా యూనిట్ గాని భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో కొన్ని వందల సంఖ్యలో బయోపిక్ లు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయితే, మరికొన్ని ప్లాపులుగా కూడా మిగిలాయి. దానికి కారణం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించలేకపోవడం లేదా కథను వక్రీకరించి చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా దర్శకుడు ఎవరికీ ఫెవర్ గా చూపించకుండా జరిగిన వాస్తవాలను చూపిస్తే ఆ బయోపిక్ సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ‘లవ్ అజ్ కల్’ లాంటి ఒక అద్భుతమైన హిట్ సినిమా తీసిన డైరెక్టర్ ‘ఇంతియాజ్ అలీ’ ప్రముఖ గాయకుడు ఆయన “అమర్ సింగ్ చమ్కీలా” బయోపిక్ ను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా అన్ని బయోపిక్ లా లాగానే ప్రేక్షకుడిని అలంరించిందా లేదా ఇంతియాజ్ అలీ డైరెక్షన్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అమర్ సింగ్ చమ్కీలా అనే వ్యక్తి 1960 జూలై 21 వ తేదీన పంజాబ్ లోని దుగ్రి అనే ప్రాంతం లో జన్మించాడు. ఇక చిన్నప్పటి నుంచి ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సమాజంలో ఆయనకు ఎదురైన విపత్కర పరిస్థితులు ఎలాంటివి. వాటిని ఎదుర్కోవడానికి ఆయన ఎలా గాయకుడిగా మారాడు. ఇక ఆయన జీవితంలో ఆయనకి సంబంధించిన వ్యవహారం గాని, ఆయన రెండో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు గాని వాటిని ఎలా డీల్ చేశాడు. దుండగులు అతన్ని చంపడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని బలంగా చూపిస్తూ ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించాడు. 1988 పంజాబ్ రాష్ట్రం లోని మొహసంపుర్ లో ఒక ప్రోగ్రాం పాల్గొన్న అమర్ సింగ్ ఆయన రెండో భార్య అయిన అమర్ జిత్ కౌర్ లను కొంతమంది దుండగులు కాల్చి చంపేశారు. కేవలం 28 సంవత్సరాల వయసులోనే చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం… ఇక వాళ్ల చావుకి మూల కారణం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని మీరు తప్పకుండా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సాధారణంగా బయోపిక్ లను రెండు రకాలుగా చూపించవచ్చు. ఒకటి డాక్యుమెంటరీ టైపులో, రెండు సినిమా ద్వారా.. ఇక డాక్యుమెంటరీ టైప్ లో తీస్తే అందులో ఎంటర్ టైన్ మెంట్ అంశాలు ఏమీ ఉండవు. అది జస్ట్ ఆయనకు సంబంధించిన స్టోరీని కొద్దిసేపు తిలకించి ఆయన గురించి తెలుసుకోవడం తప్ప, అందులో మనం పొందే అనుభూతి అయితే ఏమీ ఉండదు. ఇక సినిమాగా తెరకెక్కిస్తే రెండున్నర గంటల పాటు ఆ కథకు కావాల్సిన ఎమోషన్స్ ని జోడిస్తూ ఆ కథలో ఉన్న ఎమోషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రజెంట్ చేసి చూపిస్తారు.ఇక ఇదే విధంగా ఇంతియాజ్ అలి ఈ సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేశాడు..ఈ సినిమాలో ‘దిల్ జిత్ దోసాంజ్’ లీడ్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇక పరిణితి చోప్రా కూడా చాలా బాగా నటించింది. ముఖ్యంగా దర్శకుడు ఇంతియాజ్ అలీకి ఈ గాయకుడి యొక్క బయోపిక్ తీయాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…

నిజానికి చమ్కీలా తనే కొన్ని బూతు మాటలు వచ్చేలా పాటలు రాసుకొని ఆ పాటలు పాడుతూ ఉండేవాడు. అలా దానివల్లే ఆయన పాటలకు ఎక్కువగా క్రేజ్ అనేది పెరిగింది. ఇక ఇలాంటి టైంలోనే మత పెద్దలు, మిలిటెంట్లు ఆయన్ని ఇలాంటి పాటలు పాడకూడదని హెచ్చరించే సీన్ లకి ఆయన చూపించిన నటన వైవిధ్యం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇంతియాజ్ రాసుకున్న ప్రతి సీను కూడా చాలా పొటెన్షియాలిటీ ఉన్న సీన్ చమ్కీలా జీవిత కథను ఆధారంగా చేసుకొని చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఆయన నడిపించిన స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా నడుస్తుంది. ఇది బయోపికా లేదంటే ఫిక్షన్ స్టొరీ నా అనేంతలా ప్రేక్షకుడు మైమరిచిపోయి ఆ సినిమాలో లీనామైపోతాడు. ఇక బయోపిక్ లని తీసే దమ్ము కొంతమంది దర్శకులకు మాత్రమే ఉంటుంది.

అందులో ఇంతియాజ్ అలీ కూడా ఒక్కరు అని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ఇక చమ్కీలా జీవితంలో చాలా వైవిధ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకోవడం, సీక్రెట్ గా బీడీలు తాగడం. అతనికున్న ఇష్టాలన్ని తీర్చుకోవడం ఇలాంటి చాలా ఎమోషన్స్ ఉన్న కథ ఇది. దీన్ని డీల్ చేయడం కత్తి మీద సామ్ లాంటిది. కానీ దీన్ని దర్శకుడు చాలా ఈజీగా డీల్ చేసి మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపు కొంచెం స్లో గా ఉన్నప్పటికీ స్టోరీ లోకి ఎంటర్ అయిన తరువాత ఈ సినిమా మంచి జోష్ ను ఇస్తుంది…ఇక పరిణితి చోప్రా దిల్జిత్ దోసాంజ్ మధ్య వచ్చే కొన్ని సీన్లు అయితే సినిమా చూసే ప్రేక్షకుడి కండ్లల్లో నీళ్లు తెప్పిస్తాయి. ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులను చాలా ఎమోషన్ కి అయితే గురి చేశాడు… అయితే కొన్ని సీన్లల్లో ఏ ఆర్ రహమాన్ ఇచ్చిన బిజిఎం అయితే ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇక ఈయన మరణానికి సంబంధించిన కారణం ఏంటి అనేది సినిమాలో ఇన్ క్లూడ్ చేసి చూపిస్తూ లాస్ట్ లో అతడికి ట్రిబ్యూట్ చేసిన విధానం కూడా ప్రేక్షకుడికి చాలా బాగా నచ్చింది…

ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక బయోపిక్ ని డాక్యుమెంటరీ టైపులో కాకుండా, కల్పితలను సృష్టించి కాకుండా, ఆయన నిజ జీవితంలో నుంచి ఒక కథగా రాసుకొని దానికి సరిపోయే స్క్రీన్ ప్లే ని వాడుతూ ఎక్కడ హైప్ చేయాలి. ఎక్కడ లో చేయాలి అనే పద్ధతులను అనుసరిస్తూ కూడా సినిమాని తీసి సక్సెస్ చేయొచ్చు అని ఇంతియాజ్ అలీ నిరూపించాడు. ఆ సినిమా సోల్ మిస్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం ఎలా చెప్పిన ఆడియన్ రీసివ్ చేసుకుంటాడు అనే పాయింట్ లో తీసిన ఈ సినిమా 100 కు 100 మార్కులు కొట్టేసింది…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి సరిగ్గా సరిపోయింది. ఎక్కడ ఏ సీన్ కి ఎలాంటి బిజిఎం వాడాలో రెహమాన్ అలాంటి మ్యూజిక్ ను అయితే అందించాడు. ఇక సీన్ మూడు కి తగ్గట్టుగానే మ్యూజిక్ పరికరాలను వాడుతూ ఆ సినిమా ఫీల్ ని క్యారీ చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండడం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది..

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టు పర్ఫామెన్స్ విషయానికొస్తే మెయిన్ లీడ్ లో నటించిన “దిల్ జీత్ దోసాంజ్” సినిమా భారం మొత్తాన్ని మోసాడనే చెప్పాలి. నిజానికి ఈయన వన్ మ్యాన్ షో చేశాడు. చమ్కీలా ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం తనని యాజ్ ఇట్ ఈజ్ గా రీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆ పాత్ర కి ఈయన నిజంగానే జీవం పోశాడనే చెప్పాలి. ఇక బయోపిక్ లా విషయంలో ఆర్టిస్టులు కీలకపాత్ర వహిస్తారు. అప్పుడున్న వాళ్ళు ఎలాంటి విధానంలో నడుచుకునేవారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది అనే దానికి తగ్గట్టుగా రీసెర్చ్ చేసి ఈ సినిమాలో చమ్కీలా క్యారెక్టర్ ని ఆజ్ ఇట్ ఇస్ గా చేశాడనే చెప్పాలి. ఇక పరిణితి చోప్రా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చి దోసాంజ్ కు సపోర్ట్ చేసింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పరిధి మేరకు బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ వీళ్లిద్దరు మాత్రం చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు…

ప్లస్ పాయింట్స్

రైటింగ్
దిల్ జిత్ దోసాంజ్ యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్స్ …

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి…
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం…

రేటింగ్
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
బయోపిక్ లు చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సినిమా చూడవచ్చు…వాళ్ళకి బాగా నచ్చుతుంది…

Amar Singh Chamkila | Official Trailer | Imtiaz Ali, A.R. Rahman, Diljit Dosanjh, Parineeti Chopra

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version