Telugu Film Industry : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆయనకి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తన దగ్గరికి వెళ్తే దానికో సొల్యూషన్ చూపించేవారు. ముఖ్యంగా చిన్న సినిమాలు బతకాలి అనే కాన్సెప్ట్ తో దాసరి నారాయణరావు చాలా వరకు థియేటర్లని ఆ సినిమాలకు కేటాయించే ప్రయత్నం చేశాడు… అప్పట్లో చాలామంది చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేశాడు. దాంతో వాళ్ళు తమ సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసుకొని సూపర్ సక్సెస్ లను సాధించారు. దానివల్ల చిన్న ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు, అలాగే క్వాలిటీ కథతో సినిమాలు కూడా ఎక్కువగా వచ్చాయి. కానీ ఆయన తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు లేక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనాధగా మారిపోయింది. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్ద గా ఎవరుంటారు అనే దానిమీద సరైన క్లారిటీ రావడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిక్కెట్ల రేట్లు తగ్గించడం, ప్రీమియర్స్ కి, బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇవ్వకపోవడం లాంటి కార్యకలాపాలు చేశాడు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ చిన్న నిర్మాతలు చిరంజీవి దగ్గరికి వెళ్లి ఇలా అయితే మేము చాలా నష్టపోతాం అని చెప్పారట…ఇక వాళ్ల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్న చిరంజీవి సీఎం జగన్ గారితో నేను మాట్లాడి దీనికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను అని చెప్పాడట…. చిరంజీవి ఈ విషయం మీద జగన్ తో మాట్లాడటానికి ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది స్టార్ హీరోలను, అలాగే కొంతమంది దర్శకులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఇక అప్పుడు వీళ్ళ బాధలను విన్న జగన్మోహన్ రెడ్డి కొంతవరకు సినిమాల మీద వెసులుబాటు కల్పించాడు. అప్పుడెప్పుడో అయిపోయిన ఈ మ్యాటర్ ని రీసెంట్ గా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి మీద కొన్ని విమర్శలైతే చేశాడు… ఇక ఇది చూసిన చాలామంది చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా తను ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ప్రయత్నం చేశాడు. బాలకృష్ణ మాత్రం లేనిపోని అబండాలు వేస్తూ చిరంజీవిని బ్యాడ్ చేస్తున్నాడు అంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఇక వెంటనే బాలయ్య మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి అంటూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం మీద కూడా క్లారిటీ వస్తే బాగుంటుంది. ఇక చిరంజీవి అప్పుడు ముందు పడి అంత చేస్తే ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా బాలయ్య ఇలా మాట్లాడటం చూసిన మెగా అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకులు సైతం అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి చిరంజీవికి అఫిషియల్ గా ఇండస్ట్రీ పెద్ద అనే ఒక హోదాని ఇచ్చుంటే బాగుండేది. అప్పుడు బాలయ్య బాబు లాంటివారు ఇలా మాట్లాడి ఉండేవారు కాదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చిరంజీవి ఎప్పుడు ఇండస్ట్రీ బాగుకోసమే ప్రయత్నం చేశాడు. కానీ తన స్వప్రయోజనాల కోసం కాదు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ఇక ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి అటు మోహన్ బాబు, ఇటు బాలకృష్ణ, చిరంజీవి తో పోటీ పడుతున్నారు. ఇక వీళ్ళ మధ్య ఉన్న పోటీలో ఎక్కువమంది సినిమా సెలబ్రిటీలు సైతం ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉంటే బాగుంటుందని చెబుతుండటం విశేషం… మరి తొందరలోనే చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా అనౌన్స్ చేస్తే ఇండస్ట్రీ లో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ చూపిస్తాడనేది వాస్తవం…