Tollywood: తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పుడు ఒక పెద్ద కావాలి. ఆ పెద్ద చిరంజీవినే అని కొందరు, లేదు… మోహన్ బాబు లాంటి వ్యక్తి పెద్దగా ఉండాలి అని నరేష్ లాంటి వ్యక్తులు కొందరు.. ఇలా రకరాల కామెంట్లు చేస్తున్నారు. అసలు పెద్ద అంటే ఏమిటి ? కష్టాల్లో ఉన్న వాళ్లకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వడం. అన్యాయానికి గురి అయిన వాళ్లకు న్యాయం చేయడానికి దేనికైనా సిద్ధం అవ్వడం. అసలు ఈ మెగాస్టార్లు సూపర్ స్టార్లు నష్టాల్లో కష్టాల్లో ఉన్నవాళ్లను కలుస్తారా ?

ఒకవేళ వాళ్ళు పబ్లిసిటీ కోసమైనా కలవాలని ఆత్రుత పడినా.. ఆ స్టార్ల చుట్టూ చేరిన తొత్తులు వాళ్ళను కలవనిస్తారా ? ఒకప్పుడు దాసరి నారాయణ గారు పెద్దగా ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అర్ధరాత్రి.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను కొట్టి అఫీస్ నుంచి బయటకు నెట్టేశారు. శాలరీ కూడా ఇవ్వలేదు. పెద్దగా పరిచయాలు లేని ఆ అసిస్టెంట్ నేరుగా దాసరి ఇంటికి వెళ్ళాడు.
వాచ్ మెన్ కి సందేశం పంపితే.. వెంటనే దాసరి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ను పిలిపించుకుని ఆ రాత్రినే ఆ సినిమా అఫీస్ కి ఫోన్ చేసి.. వెంటనే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీ వేయించాడు. మరి ఇప్పుడు పెద్ద అని చెబుతున్న చిరంజీవి ఇంటిలోకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నేరుగా జీవితంలో వెళ్లగలడా ? కచ్చితంగా చిరంజీవి మంచి వ్యక్తే. కానీ అలాంటి స్టార్ పెద్ద మనిషిగా పనికిరాడు.
పెద్దమనిషి అంటే.. పదిమందిలో కలిసిపోయేవాడు, పదిమందిని కలుపుకునిపోయేవాడు. కానీ చిరంజీవికి అది సాధ్యం కాదు. అందుకే దాసరి లేని లోటు భర్తీ చేయలేరు ఎవరు. దీనిపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అసలు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కే అవసరం లేదని ఆయన చెప్పడం విశేషం.
రాఘవేంద్రరావు మాటల్లోనే.. ‘నిజానికి ఇక్కడ ఎవరి మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అలాంటప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకు ? అందుకే పెద్ద అవసరమే లేదు’ అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. ఇండ్రస్ట్రీలో ఉన్న హీరోలందరితోనూ దర్శకేంద్రుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లేండి. అందుకే ఆయన సున్నితంగా ఈ విధంగా సమాధానం చెప్పి తప్పించుకున్నారేమో.