Tollywood Highest Grossing Films: మన టాలీవుడ్ లో మొదటి రోజు, మొదటి వీకెండ్, మొదటి వారం లో వచ్చే వసూళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం, అదే విధంగా క్లోజింగ్ లో వచ్చే వసూళ్ల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ రెండవ వారంలో వచ్చే వసూళ్ల గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు మనం రెండవ వారం అత్యదిక వసూళ్లను రాబట్టిన సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రెండవ వారం టాప్ 10 స్థానం లో దక్కలేదు. మొదటి స్థానం లో #RRR చిత్రం ఉన్నది. ఈ సినిమాకు రెండవ వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 61.11 కోట్ల రూపాయిల షేర్ వసూల్ వచ్చాయి. ఈ చిత్రానికి దరిదాపుల్లో మరో సినిమా కూడా లేదు.
అదే విధంగా రెండవ స్థానం లో కూడా రాజమౌళి బాహుబలి 2 చిత్రమే ఉన్నది. ఈ సినిమాకు రెండవ వారం లో 40.28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అట. అదే విధంగా 35.64 కోట్ల రూపాయిల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం మూడవ స్థానం లో కొనసాగుతుండగా, ప్రభాస్ కల్కి చిత్రం 31.75 కోట్ల రూపాయలతో నాల్గవ స్థానం లో కొనసాగుతుంది. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సెన్సేషన్ సృష్టించిన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి 5 వ స్థానం లో నిలబడగా, 27 కోట్ల రూపాయలతో ‘హనుమాన్’ చిత్రం 6వ స్థానం లోనూ, 26 కోట్ల రూపాయిల షేర్ తో ‘బాహుబలి’ చిత్రం 7వ స్థానం లోనూ కొనసాగుతున్నాయి. ఇక ఆ తర్వాత ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం 25.52 కోట్ల రూపాయలతో 8వ స్థానం లోనూ, 24 కోట్ల రూపాయలతో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 9వ స్థానం లోనూ కొనసాగవుతున్నాయి.
అదే విధంగా 10 వ స్థానం లో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం 21.80 కోట్ల రూపాయలతో కొనసాగుతుండగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం 21.77 కోట్ల రూపాయలతో 11 స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత 12 వ స్థానం లో దేవర చిత్రం 21.26 కోట్ల రూపాయిలు, 13 వ స్థానం లో ‘సలార్’ చిత్రం 18.88 కోట్లు, 14 వ స్థానం లో ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం 18.66 కోట్లు, 15 వ స్థానం లో 17.69 కోట్లతో F2 , 16 వ స్థానం లో 17.3 కోట్ల రూపాయలతో ఓజీ చిత్రం కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో టాప్ 10 లో ఎవరు స్థానం దక్కించుకోబోతున్నారో చూడాలి.