Homeఎంటర్టైన్మెంట్Tollywood Hero`s Remunarations : హిట్లు పడగానే రేట్లు పెంచారు: ఇంతకీ మన హీరోలు ఎంత...

Tollywood Hero`s Remunarations : హిట్లు పడగానే రేట్లు పెంచారు: ఇంతకీ మన హీరోలు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

Tollywood Hero`s Remunarations : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ సామెత చిత్ర పరిశ్రమకు బాగా వర్తిస్తుంది.. కొత్తదనానికి పెద్ద పీట వేసే చిత్ర పరిశ్రమ.. విజయాలు లేని వారిని పెద్దగా పట్టించుకోదు.. ఇలా సరైన హిట్లు లేక ఫేడ్ అవుట్ అయిన నటీనటులు ఎంతోమంది. అందుకే సినిమా పరిశ్రమలో కష్టంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. ఇక సినిమా పరిశ్రమలో బలమైన నేపథ్యం ఉన్న వారి సంగతి వేరే విధంగా ఉంటుంది.. వీరికి ఎన్ని ఫ్లాఫ్ లు ఎదురైనా.. ఒక్క హిట్ పడితే చాలు దెబ్బకు వీరి సీను మారిపోతుంది.. ఉదాహరణకు రవితేజను తీసుకుంటే క్రాక్ సినిమా దాకా ఆయనకు సరైన హిట్లు లేవు.. క్రాక్ సినిమా సూపర్ సూపర్ హిట్ కావడంతో ఆయన మార్కెట్ పెరిగింది.. రెమ్యూనరేషన్ కు కూడా రెక్కలు వచ్చాయి.. ఆ తర్వాత వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ దశలో ధమాకా అనే సినిమా వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా డిసెంబర్ నెలలో భారీ విజయాన్ని నమోదు చేసింది.. అంతేకాదు 100 కోట్లు వసూలు చేసిందని సినిమా నిర్మాత చెబుతున్నారు. అయితే ఈ సినిమా విజయవంతం తర్వాత రవితేజ తన రెమ్యూనరేషన్ పెంచారని వినికిడి.. ప్రస్తుతం ఆయన ఒక సినిమాకు 20 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారని సమాచారం.. రవితేజ చేతిలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలు ఉన్నాయి.. మరికొన్ని పైపులైన్ దశలో ఉన్నాయి.

సీనియర్ హీరోలు కూడా

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల హవా నడుస్తోంది.. ఇటీవల కాలంలో సీనియర్ హీరోల రెమ్యూనరేషన్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆ మాటకు వస్తే అందరూ హీరోల రెమ్యూనరేషన్లు కూడా భారీగా పెరిగిపోయాయి.. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు గాను మెగాస్టార్ చిరంజీవి 50 కోట్ల వంతున రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. మొన్నటి వరకు 18 కోట్ల వరకు తీసుకున్న రవితేజ ఇప్పుడు దానిని 20 కోట్లు చేశారని సమాచారం. వీర సింహారెడ్డి సినిమాను మొదట ఎనిమిది కోట్లకు ఓకే చేసిన బాలకృష్ణ… అఖండ విజయం తర్వాత దానిని 12 కోట్లకు మార్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాకు 14 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారని సమాచారం. ఇక కొత్త సినిమాలకి 16 కోట్ల వరకు తీసుకుంటారని టాలీవుడ్ జనాలు అంచనా వేస్తున్నారు. ఎఫ్ 3 సినిమాకు ఎనిమిది కోట్ల వరకు తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సైంధవ్ అనే సినిమాకు 12 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

సీనియర్ హీరోల పరిస్థితి ఇలా ఉంటే మీడియం రేంజ్ బడ్జెట్ హీరోలయిన నాని 20 కోట్ల వరకు కోట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 25 కోట్లు అడుగుతున్నారని సమాచారం.. లైగర్ కనుక విజయవంతమై ఉంటే విజయ్ 40 కోట్ల వరకు చార్జ్ చేసేవారని, ఆ సినిమా ఫెయిల్ కావడంతో నేలకు దిగివచ్చారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కార్తికేయ _2 విజయవంతం తర్వాత హీరో నిఖిల్ ఏడు కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.. నాగ శౌర్య నాలుగు కోట్ల వరకు తీసుకుంటున్నారని వినికిడి.. రాక్షసుడు తప్ప కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్టు లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా 10 కోట్ల వరకు అడుగుతున్నారు.

నాన్ థియేటర్ హక్కులు, ఓవర్ సీస్ హక్కులు పెరగటం, సినిమా బాగుంటే థియేటర్ల రెవెన్యూ పెరగడం వంటివి హీరోలు తమ రెమ్యూనరేషన్ లు పెంచేందుకు దోహదం చేశాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల ఓ అగ్ర కథానాయకుడు తన సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ… హీరోలు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, తమ మార్కెట్ పరిధి మేరే రెమ్యూనరేషన్ వసూలు చేయాలని సూచించారు.. కానీ ఆయన సూచనలు హీరోలు అంతగా నెత్తికి ఎక్కించుకున్నట్టు లేదు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version