Tollywood Heroine : కానీ వాళ్లు చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా ప్రేక్షకుల మనసులో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాలీవుడ్ డ్యూటీ కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తోపు హీరోయిన్. ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగుతోపాటు ఈ బ్యూటీ తమిళ్, మలయాళం భాషలలో కూడా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ప్రేక్షకుల హృదయంలో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, జగపతిబాబు వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఈమె చేసిన సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఈమెకు అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. అలాగే ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందాయి. దాంతో ఈమెకు రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీతో జీవితం గడుపుతుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న హీరోయిన్ గజాల. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడు జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో 2001లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది గజాల. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుతుంది.
Also Read : ‘రెట్రో’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ఆడియన్స్ ఏడుపు ఆపుకోలేరు!
ఆ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత తెలుగులో కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్, అల్లరి రాముడు వంటి సినిమాలలో నటించిన. చివరగా గజాల తెలుగులో జానకి వెడ్స్ శ్రీరాం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే గజాల 2002లో సూసైడ్ అటెంప్ట్ చేసింది.
హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రశాంత్ కుటీర అనే అతిథి గృహంలో జూలై 22, 2002లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో వెంటనే గమనించిన సహనటులు సుల్తానా, అర్జున్ ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో బ్రతికి బయటపడింది గజాల. అప్పట్లో ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని కొన్ని వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న గజాల హిందీ టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను పెళ్లి చేసుకుంది.
Also Read : అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నష్టాలను చవి చూస్తుందా..?