Tollywood Heroine : ఇప్పటివరకు ఈ హీరోయిన్ చేసిన నాలుగు సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. ఈమె చేసిన మొదటి రెండు సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరో హీరోయిన్లు చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు వివిధ రకాల ఉద్యోగాలు చేసిన వాళ్లే. ఈ హీరోయిన్ కూడా ఆ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఉద్యోగం చేసేది. చిన్నప్పటి నుంచి ఈమె చదువులో బాగా చురుకు. తన పదవ తరగతిలో 94 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ 85% మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిస్టింక్షన్ కూడా సాధించింది. చదువు పూర్తయిన తర్వాత బెంగళూరులో ఉన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసేది. ఆ సమయంలోనే ఆమెకు మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఉద్యోగం మానేసి ఈ బ్యూటీ పలు అందాల పోటీలలో పాల్గొంది.
ఆ సమయంలోనే మిస్ కర్ణాటక అండ్ మిస్ బ్యూటీ ఫైల్, మిస్ సూప్రా నేషనల్ వంటి ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొని టైటిల్ను కూడా గెలుచుకుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, ఫ్రాన్స్, థాయిలాండ్, సింగపూర్, పోలాండ్ తదితర దేశాలలో జరిగిన అందాల పోటీలలో కూడా పాల్గొని తన సత్తా చాటింది. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా రూ.1250 కోట్లు కలెక్షన్లు రాబట్టి భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఈమె చేసిన సినిమా ఇండియన్ సినిమాలలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈమె నటించిన మరొక సినిమా హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా హిట్టు కావడంతో ప్రస్తుతం ఈమె పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు తాజాగా హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇప్పటివరకు ఈమె కే జి ఎఫ్, కేజిఎఫ్ 2, కోబ్రా, హిట్ 3 సినిమాలలో నటించింది. అయితే వీటిలో కోబ్రా సినిమా మాత్రమే యావరేజ్ సినిమాగా నిలిచింది. మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శ్రీనిధి 2022లో శోభన సినిమాలో నటించిన మూడేళ్ల తర్వాత మరొకసారి హిట్ 3 సినిమాతో రీసెంట్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే ఒకటవ తేదీ శుక్రవారం రోజు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.