Tollywood Heroine : బాలీవుడ్ మూవీ వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. అలాగే దేవర సినిమాకు సీక్వెల్ తో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు అలా వచ్చి ఇలా కనుమరుగైపోతుంటారు. వాళ్లు చేసింది కేవలం కొన్ని సినిమాలు అయినా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కొంతమంది ప్రేక్షకులు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మరి కొంతమంది మాత్రం ఆ హీరోయిన్లను మర్చిపోయి ఉంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే. ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఇప్పటివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలలో హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమా శక్తి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందు రిలీజ్ అయ్యే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటించారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో ఎన్టీఆర్ భార్యగా నటించిన నటి అందరికీ గుర్తుండే ఉంటుంది. మంజరి ఫెడ్నెస్. అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో మంజరి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.
Also Read : ‘బ్రహ్మముడి’ హీరోయిన్ తో నాని..బంపర్ ఛాన్స్ కొట్టేసిందిగా!
తన అందంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత మరోసారి అల్లరి నరేష్కు జోడిగా శుభప్రదం సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. శుభప్రదం సినిమా కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించిన చివరి సినిమా. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మంజరి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు జోడిగా శక్తి సినిమాలో నటించింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే మంజరీకి మంచి క్రేజ్ వచ్చి ఉండేది. కానీ ఈ సినిమా పరాజయం పొందడంతో ఆమె బాలీవుడ్ వైపు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. మంజరి మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో కూడా వరుసగా నటిస్తుంది. హిందీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ పరీక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ శక్తి సినిమా హీరోయిన్ ఎలా ఉంది అంటూ నేటిజన్స్ సోషల్ మీడియా మొత్తం తెగగాలిస్తున్నారు. ఈ క్రమంలో మంజూరు లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.