Krithi Shetty: తెలుగు చిత్ర పరిశ్రమలో బేబమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్ధుగుమ్మ మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఒక్క సినిమాతో తనదైన నటనతో శైలితో ప్రేక్షకుల మదిలో బేబమ్మగా చెరగని ముద్ర వేసుకుంది.
పంజా వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి ‘ఉప్పెన’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సుమారు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత నానితో శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్యతో బంగర్రాజు వంటి సినిమాల్లో నటించి మరోసారి ప్రేక్షకుల మదిలో బేబమ్మ తన మార్క్ వేసింది. ఆ తరువాత బేబమ్మకు సరైన అవకాశాలు రాకపోవడంతో మధ్యలో కనిపించలేదు. కొన్ని రోజుల తరువాత నాగచైతన్యతో మరోసారి జోడీ కట్టింది కృతిశెట్టి. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన కస్టడీ ’ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. అలాగే డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వంలో నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించింది.
ప్రస్తుతం తెలుగులో హీరో శర్వానంద్ సరనస నటిస్తున్న కృతిశెట్టి లవ్ టుడే ఫేమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కు జోడీ కట్టారని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అలాగే తమిళంలో ఓ మూవీ, మలయాలంలోనూ ఓ సినిమా చేస్తున్నారని సమాచారం.
సినిమాలతో సంబంధం లేకుండా బేబమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ సైలెంట్ అయిన బేబమ్మ కృతిశెట్టి షేర్ చేసినా ఫొటోలు వైరల్ గా మారాయిని తెలుస్తోంది. ట్రెండీ గ్లామర్ లుక్స్ తో అభిమానుల మనసులను కట్టి పడేస్తుంది. వైట్ డ్రెస్సులో అందమైన చిరునవ్వుతో కనిపిస్తున్న బేబమ్మను చూసిన కుర్రకారు మతిపోతుందని చెప్పుకోవచ్చు.
View this post on Instagram