Shivaji: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ హౌస్ లో ఉన్నప్పుడు .. ఈ అవకాశం దక్కడం అదృష్టం. ఈ షో లో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను అంటూ చాలా సార్లు చెప్పారు. కానీ బయటకు వచ్చిన శివాజీ బిగ్ బాస్ షో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఓడిపోవడానికి కారణం కూడా చెప్పారు శివాజీ. నిజానికి ఆయన బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అవ్వాల్సింది .. కానీ 12 వ వారం అమర్ కెప్టెన్సీ విషయంలో శివాజీ విలన్ అయిపోయాడు.
అమర్ కెప్టెన్ కానివ్వకుండా శివాజీ అడ్డుకోవడం … అమర్ దీప్ ప్రాధేయ పడుతూ ఏడవడంతో శివాజీకి నెగిటివ్ అయ్యింది. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బాగా పుంజుకున్నారు. దీంతో ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. శివాజీకి మూడవ స్థానం కైవసం చేసుకున్నారు. దీనిపై శివాజీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇష్టం లేనప్పుడు షో లో కి ఎందుకు తీసుకున్నారు .. నన్ను విలన్ ని చేశారు అంటూ ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో శివాజీ మాట్లాడుతూ .. అమర్ విషయంలో నన్ను విలన్ ని చేయడానికి చూశారు .. ఎపిసోడ్ లు అన్నీ చూసాను. 12వ వారం నుంచి నన్ను విలన్ ని చేయడానికి మాగ్జిమమ్ ట్రై చేశారు. వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా .. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. మీకు ఇష్టం లేనప్పుడు కంటెస్టెంట్స్ ని తీసుకోవద్దు. ఇంత గొప్ప షో ని చిన్న చిన్న సిల్లీ థింగ్స్ తో కంట్రోల్ చేయడం తప్పు.
నేను అమర్ ని అసలు టార్గెట్ చేయలేదు. కానీ టార్గెట్ చేసినట్టు చూపించారు. మేమేదో సరదాగా అనుకున్న విషయాలు ఎడిటింగ్ లో వేరే విధంగా చూపించారు. అమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు. నేను అతని అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను .. నేను అమర్ కి కప్పు రాకూడదని మాత్రం అనుకోలేదు. అన్ని వారాలు సరిగా ఆడలేదని .. ఫౌల్ గేమ్ ఆడాడని స్వయంగా అతనే చెప్పాడు. తను సెకండ్ ప్లేస్ కి వచ్చాడు కదా .. నేను ఆపితే ఆగలేదు కదా అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. అమర్ విషయంలో విలన్ గా చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే శివాజీ టైటిల్ మిస్ అయ్యాడు అనడంలో సందేహం లేదు.