Tollywood Heroine : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అధికారికంగా ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించి సినిమా మేకర్స్ ఇటీవలే ఒక వీడియోను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమా అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ మరియు ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కానీ అల్లు అర్జున్ ను యాక్షన్ హీరోగా మార్చిన సినిమా మాత్రం బన్నీ. టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన బన్నీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
Also Read : నన్ను వింతగా చూసేవారు.. పొట్టిగా, లావుగా ఉన్నావంటూ హేళన చేశారు…స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్…
ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు స్టైల్, డాన్స్ అన్నీ కూడా పరీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమాలోని పాటలన్నీ బాగా పాపులర్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటించిన హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ హీరోయిన్ పేరు గౌరీ ముంజాల్. ఈమె బన్నీ సినిమాలో తన అందంతో, నటనతో క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. తెలుగు తో పాటు ఈ చిన్నది తమిళ్, కన్నడ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే గౌరీ ముంజాల్ ఒక తమిళ సినిమాలో కూడా నటించడం జరిగింది.
తెలుగులో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా కన్నడ సినిమా ఇండస్ట్రీ పైనే తన దృష్టి పెట్టింది. చివరిసారిగా ఈమె తెలుగులో హీరో జగపతి బాబుతో బంగారు బాబు సినిమాలో నటించింది. 2011 నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తెలుగులో గౌరీ ముంజాల్ శ్రీకృష్ణ 2006, గోపి గోడ మీద పిల్లి భూకైలాస్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బన్నీ సినిమా హీరోయిన్ ఎలా ఉంది, ఏం చేస్తోంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ఈ క్రమంలో గౌరీ ముంజాల్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని చెప్పొచ్చు.
View this post on Instagram