Star Heroine : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆ తర్వాత హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ తన కెరియర్ స్టార్టింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకుంది. పొట్టిగా, లావుగా ఉన్నావంటే తనను అందరూ హేళన చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోని నటీనటులను ముఖ్యంగా వేధిస్తున్న సమస్యలలో బాడీ షేమింగ్ సమస్య కూడా ఒకటి. ఈ క్రమంలో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే లేడీ కమెడియన్లు కూడా ఈ సమస్య బారిన పడ్డారు. గతంలో కూడా కొన్ని సందర్భాలలో వీటి గురించి చాలామంది ఓపెన్ గా చెప్పారు. కొంచెం బొద్దుగా కనిపిస్తే లావుగా ఉన్నావు అని అలాగే స్లిమ్ గా కనిపిస్తే బక్క చిక్కిపోయారు అంటూ కామెంట్స్ చేస్తారని కొందరు హీరోయిన్లు గతంలో నోరు విప్పారు. హీరోయిన్ హైట్ గురించి కూడా కామెంట్లు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో తాను బాడీ షేమింగ్ బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనను చాలామంది వింత జీవిలా చూసేవారని బాడీ షేమింగ్ చేసేవారని చెప్పుకొచ్చింది. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు నిత్యా మీనన్. లేటెస్ట్ గా ఈమె తన నటనకు నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
Also Read : ఆ స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ తో రష్మిక మందాన దూకుడుకు బ్రేక్..
తెలుగుతోపాటు తమిళ్, మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించి నిత్యామీనన్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో ఈమె నేచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించిన హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అందరితో పంచుకుంది. తన కెరియర్ ప్రారంభంలో తన జుట్టును చూసి అందరూ వింతగా చూసేవారని తెలిపింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ నిత్యామీనన్ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొచ్చింది.
తాను స్కూల్, కాలేజీ చదివేటప్పుడు తన జుట్టు తనకు పెద్ద సమస్యగా ఉండేదని తెలిపింది. అప్పట్లో రింగులు రింగులుగా తిరిగిన తన జుట్టును చూసి అందరూ తనను వింతగా చూసే వాళ్ళని చెప్పుకొచ్చింది. నా రింగుల జుట్టును చూసి నా మొదటి సినిమా సమయంలో కూడా చాలా హేళన చేశారంటూ నిత్యామీనన్ తెలిపింది. మీరు చాలా పొట్టిగా, లావుగా ఉన్నారు, మీకు అనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి అంటూ చాలామంది తనను హేళన చేశారని చెప్పుకొచ్చింది. కానీ ఆ మాటలే నన్ను ప్రభావితం చేశాయి, అందుకే నేను రాణించగలుగుతున్నాను అంటూ నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా జుట్టు అంటే చాలామందికి ఇష్టం అని తెలిపింది.
View this post on Instagram